Chiranjeevi – Khaidi: 40 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘ఖైదీ’. అప్పట్లోనే రికార్డు కలెక్షన్స్.

| Edited By: Anil kumar poka

Oct 29, 2023 | 8:08 PM

చిరంజీవి కెరీర్‌లో ఎన్ని సినిమాలు వచ్చినా.. ఖైదీ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. ఈ సినిమా వచ్చి నేటికి 40 ఏళ్ళు పూర్తైంది. మరి మెగాస్టార్ కెరీర్‌లో ఖైదీ తీసుకొచ్చిన మార్పులేంటి..? అసలు ఈ సినిమా వచ్చినపుడు చిరు ఇమేజ్ ఏంటి..? మార్కెట్ ఎంత..? ఖైదీలో చిరంజీవి ఏ హాలీవుడ్ సినిమాను స్పూర్తిగా తీసుకున్నారు..? ఆ తర్వాత ఆయన కెరీర్‌లో ఖైదీ పేరుతో ఎన్ని సినిమాలొచ్చాయి..? ఖైదీ 40 ఇయర్స్‌పై స్పెషల్ స్టోరీ..

1 / 6
చిరంజీవి కెరీర్‌లో ఎన్ని సినిమాలు వచ్చినా.. ఖైదీ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. ఈ సినిమా వచ్చి నేటికి 40 ఏళ్ళు పూర్తైంది. మరి మెగాస్టార్ కెరీర్‌లో ఖైదీ తీసుకొచ్చిన మార్పులేంటి..? అసలు ఈ సినిమా వచ్చినపుడు చిరు ఇమేజ్ ఏంటి..? మార్కెట్ ఎంత..?

2 / 6
ఖైదీలో చిరంజీవి ఏ హాలీవుడ్ సినిమాను స్పూర్తిగా తీసుకున్నారు..? ఆ తర్వాత ఆయన కెరీర్‌లో ఖైదీ పేరుతో ఎన్ని సినిమాలొచ్చాయి..? ఖైదీ 40 ఇయర్స్‌పై స్పెషల్ స్టోరీ..  ఖైదీ.. చిరంజీవి కెరీర్‌ను మార్చేసిన సినిమా ఇది. అక్టోబర్ 28, 1983లో విడుదలైన ఈ చిత్రానికి 40 ఏళ్ళు పూర్తయ్యాయి.

3 / 6
నిజానికి ‘ఖైదీ’ చిరు చేయాల్సిన సినిమా కాదు.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణ చేయాల్సిన సినిమా. అనుకోకుండా కోదండరామిరెడ్డి, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చింది. 1982లో వచ్చిన అమెరికన్‌ మూవీ ‘ఫస్ట్‌ బ్లడ్‌’ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

4 / 6
ఖైదీతో చిరు స్టార్ హీరో అయిపోయారు. అప్పట్లో ఖైదీ కోసం 1,75,000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు చిరు. కృష్ణ చేతుల మీదుగానే మొదలైన ఈ చిత్ర.. 100 రోజుల వేడుకకు కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ రోజుల్లోనే ఖైదీ సినిమాకు 3.2 కోట్ల టికెట్లు తెగాయి.

5 / 6
ఆ టైమ్‌లో ఇదో పెద్ద రికార్డ్. 4 కోట్ల వరకు షేర్ వసూలు చేసి.. 20 కేంద్రాల్లో 100 రోజులు, 5 కేంద్రాల్లో 200 రోజులు, 2 కేంద్రాల్లో 365 రోజులు ఆడింది ఖైదీ. ‘ఖైదీ’ చిరుకు చాలా స్పెషల్. అందుకే ఆ తర్వాత కూడా ఖైదీ నెం 786 పేరుతో ఓ సినిమా చేసారు.

6 / 6
అది కూడా బ్లాక్‌బస్టరే. అంతేకాదు.. పదేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సినిమాకు కూడా ఖైదీ నెం 150 టైటిల్ పెట్టారంటే.. ఆ పేరుపై చిరుకు ఉన్న అభిమానం అర్థమవుతుంది. అందుకే 40 ఏళ్ళ తర్వాత కూడా ఖైదీ గురించి అంతగా ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్.