God Father Sequel: మరోసారి ఆ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్.. సీక్వెల్ షురూ.
భాషతో సంబంధం లేకుండా క్రేజ్ తెచ్చుకున్న ప్రాజెక్టులు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి లూసిఫర్. మోహన్‌లాల్ పుట్టినరోజున రిలీజ్ అయిన ఎల్2 ఎంపురాన్ ఫొటో చూసినప్పటి నుంచీ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది లూసిఫర్ టాపిక్. ఈ టాపిక్ జస్ట్ మాలీవుడ్ వరకే పరిమితమా అంటే.. బిగ్ నో.. అనే మాట వినిపిస్తోంది. టాలీవుడ్‌లోనూ ఆ వైబ్స్ కనిపిస్తున్నాయి. మోహన్‌లాల్ హీరోగా నటించిన సినిమా లూసిఫర్.