యంగ్ జనరేషన్‌తో పోటి పడాలంటే ఆ వేవ్ లెంగ్త్‌ను మ్యాచ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. అందుకే వరుసగా కుర్ర దర్శకులతోనే సినిమాలు చేస్తున్నారు చిరు. ఆల్రెడీ ఎనౌన్స్ అయిన సినిమాలతో పాటు డిస్కషన్ స్టేజ్‌లో ఉన్న సినిమాలు కూడా మెగా లైనప్ మీద అంచనాలు పెంచేస్తున్నాయి.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్యతో బిగ్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, అదే జోరు కంటిన్యూ చేసేందుకు ట్రై చేస్తున్నారు. అందుకే వరుసగా యంగ్ డైరెక్టర్స్‌తోనే సినిమాలు చేస్తున్నారు.
ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న మూవీతో పాటు అప్ కమింగ్ మూవీస్ కూడా కుర్ర దర్శకులతోనే లైన్‌లో పెట్టారు. విశ్వంభర సెట్స్ మీద ఉండగానే దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా ఎనౌన్స్ చేశారు చిరు.
ఈ సినిమాను రూత్‌లెస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించబోతున్నారు. ప్రీ లుక్ పోస్టర్‌తోనే హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ, మెగాస్టార్ కెరీర్‌లో మరో మైల్ స్టోన్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.
తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడితోనూ ఓ సినిమా ఓకే చేశారు చిరు. ఆల్రెడీ లైన్‌లో ఉన్న ఓదెల ప్రాజెక్ట్‌ను వెనక్కి నెట్టి మరీ అనిల్‌కు డేట్స్ ఇస్తున్నారు చిరు. ఈ సినిమాలతో యంగ్ జనరేషన్‌కు గట్టి పోటి ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు.