మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని.. మార్కెట్ పెంచుకోవాలని ఏ హీరోకు మాత్రం ఉండదు చెప్పండి..? అవి చేస్తూనే.. మధ్య మధ్యలో కెరీర్‌ను పణంగా పెట్టి ప్రయోగాలు చేయడం చాలా తక్కువ హీరోలు చేస్తుంటారు.
ఈ లిస్టులో వరుణ్ తేజ్ అందరికంటే ముందుంటారు. తాజాగా ఆపరేషన్ వాలంటైన్ అలా చేసిన సినిమానే. మరి ఇదెలా ఉండబోతుంది.. వరుణ్ హిట్ కోరిక తీర్చేస్తుందా.?
మెగా కుటుంబం నుంచి వచ్చినా.. ఆ లక్షణాలు పెద్దగా వరుణ్ తేజ్‌కు అబ్బలేదనిపిస్తుంది. అందుకే మాస్ సినిమాలు చేస్తున్నా.. కెరీర్ మొదట్నుంచి ఈయన మనసు డిఫెరెంట్ కథల వైపు వెళ్తుంది.
ఆపరేషన్ వాలంటైన్ కూడా అలా చేసిన సినిమానే. 2019లో జరిగిన పుల్వామా దాడుల నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది. మార్చ్ 1న విడుదల కానుంది సినిమా.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ చాలా నిజాయితీగా మాట్లాడారు దర్శక నిర్మాతలు. కమర్షియల్ సినిమాలు ఎప్పుడైనా చేయొచ్చు కానీ ఇలాంటి గొప్ప కథలు అప్పుడప్పుడే వస్తుంటాయని చెప్పారు వరుణ్ తేజ్.
అలాగే చీఫ్ గెస్టుగా వచ్చిన చిరంజీవి సైతం.. ఆపరేషన్ వాలంటైన్ మేకర్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. JRC కన్వెన్షన్‌లో జరిగిన ఆపరేషన్ వాలంటైన్ ప్రీ రిలీజ్ వేడుకకు హీరోయిన్ మానుషి చిల్లర్ మినహా.. చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు.
చాలా తక్కువ బడ్జెట్‌లో హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు శక్తిప్రతాప్ సింగ్. వరుణ్ తేజ్ కూడా ఆపరేషన్ వాలంటైన్ కోసం చాలా కష్టపడ్డారు. మరి ఆ కష్టానికి ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.