
దసరా మిస్ అయితే దీపావళికి బ్లాస్ట్ ఉంటుందని ఆడియన్స్‌ను కన్విన్స్ చేసేందుకు ట్రై చేశారు తమన్. అక్టోబర్ 30న థర్డ్ సింగిల్ పక్కాగా రిలీజ్ అవుతుందని హామీ ఇచ్చారు. తాజా అప్‌డేట్‌లో రిలీజ్ డేట్ విషయంలో కూడా క్లారటీ ఇచ్చారు.

దసరాకి టీజర్ పక్కా అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియా చాట్ సెషన్‌లో పాల్గొన్న తమన్ ఈ విషయాన్ని రివీల్ చేశారు. దసరాకు అప్‌డేట్ లేదన్న తమన్, ఈ వెయిటింగ్ వర్తే అనిపించే రేంజ్ కంటెంట్ రెడీ అవుతుందని హామీ ఇచ్చారు.

గేమ్ చేంజర్ సినిమాను బిగ్ స్కేల్‌లో రూపొందిస్తున్నారు శంకర్. గ్రాఫిక్స్ వర్క్ కూడా భారీగా ఉంది. ఆ పనులు పూర్తి చేయడానికే కాస్త టైమ్ పడుతుందని, ఈ టైమ్‌లో టీజర్, గింప్ల్స్ అంటూ వేరే పనులు పెట్టుకుంటే మెయిన్ వర్క్ డిస్ట్రబ్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు.

తాజాగా ఈ సినిమాను ట్రెండింగ్ చేసే బాధ్యత తమన్ తీసుకున్నారు. ఆయనే వరస ట్వీట్స్‌తో అభిమానుల్లో ఉత్సాహం నింపారు. పరిస్థితులు చూస్తుంటే.. గేమ్ చేంజర్ ప్రమోషనల్ బాధ్యత పూర్తిగా తమన్ తీసుకున్నారని అర్థమవుతుంది.

అదేంటనేది మాత్రం చెప్పలేదు. తమన్ తీరు చూస్తుంటే పాటను రిలీజ్ చేస్తారేమో అనే ఆసక్తి మొదలైంది ఫ్యాన్స్‌లో. మరోవైపు శంకర్ నుంచి కానీ.. దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి గానీ గేమ్ ఛేంజర్ అప్‌డేట్‌పై క్లారిటీ రావట్లేదు.

ఆ తర్వాత సౌత్ ట్రిప్ ఉంటుంది. దక్షిణాదిన అన్నీ రాజధానులను కవర్ చేయాలనుకుంటున్న టీమ్, తెలుగు రాష్ట్రాల్లో ఓ భారీ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తోంది.

అబ్బాయ్ కోసం బాబాయ్ తరలి వస్తున్నారనే టాపిక్ యమాగా కిక్ ఇస్తోంది. గేమ్ చేంజర్ లేటెస్ట్ మెలోడీకి కూడా మంచి మార్కులు పడుతున్నాయి.