
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలతో వరుసగా విజయాలను ఖాతాలో వేసుకున్నారు. దీంతో దక్షిణాదిలో డిమాండ్ ఉన్న హీరోయిన్ గా మారారు. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ తెలుగులో సరైన అవకాశం కోసం వెయిట్ చేస్తుంది.

తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఓ సినిమా విషయంలో తాను తప్పు చేశానని అంటుంది మీనాక్షి. గతంలో ఓ సినిమా చేసినందుకు ఎంతో బాధపడ్డానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆ సినిమా మరేదో కాదండి. దళపతి విజయ్ నటించిన గోట్.

విజయ్ దళపతి నటించిన ది గోట్ చిత్రంలో నటించింది మీనాక్షి. అయితే ఆ సినిమా విడుదల తర్వాత తన పాత్రపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన పాత్ర పై వచ్చిన విమర్శలు చూసి ఎంతో బాధపడ్డానని.. వారం రోజులు డిప్రెషన్ లోకి వెళ్లానని తెలిపింది.

ఆ ట్రోల్స్ వల్ల తాను ఎంచుకునే కథలు, సినిమాలపై మరింత ఫోకస్ పెట్టాలని అర్థమైందని.. అప్పటి నుంచి తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్న వాటినే అంగీకరించాలని నిర్ణయించుకున్నట్లు మీనాక్షి వెల్లడించింది. ఆ తర్వాత పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలు సెలక్ట్ చేసుకుంటుంది మీనాక్షి.

ఇక లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల తర్వాత వరుస అవకాశాలతో బిజీగా ఉంటుందని అనుకున్నారు. కానీ ఈ బ్యూటీ ఉన్నట్లుండి ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది.