
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ హీరో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తొళినాళ్లలో చాలా కష్టాలు ఎదుర్కొని, ఇప్పుడు స్టార్‌హీరోగా తన సత్తా చాటుతున్నాయి. అయితే ఈ హీరో పవన్ కళ్యాణ్, తారక్, బన్నీ రిజక్ట్ చేసిన సినిమాలతో ఏకంగా ఆరు బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడంట. ఇంతకీ అవి ఏ సినిమాలంటే?

రవితేజ సినిమాలంటేనే అందరికీ ముందుగా గుర్తు వచ్చే సినిమా ఇడియట్. ఈ మూవీ థియేటర్లలో రిలీజై హిస్టరీ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇప్పటికి కూడా ఇడియట్ మూవీ టీవీల్లో వస్తుందంటే చాలా మంది టీవీలకే అతుక్కపోతారు. అంతలా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాకుండా ఈ సినిమాతోనే రవితేజ ఓవర్ నైట్ స్టార్ హీరోల క్లబ్‌లో చేరిపోయాడు. అయితే ఈ మూవీని ముందుగా దర్శకుడు పవన్ కళ్యాణ్‌తో తీయాలి అనుకున్నాడంట. కానీ పవర్ స్టార్ ఈ మూవీని రిజక్ట్ చేయడంతో రవితేజ ఈ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

రవితేజ మూవీస్‌లో అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి అనే మూవీ చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఈ మూవీ కూడా రిలీజై సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ మూవీ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిజక్ట్ చేయడంతో రవితేజ వరకు వెళ్లిందంట, అలాగే మాస్ మహారాజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీస్‌లో భద్ర ఒకటి. ఈ మూవీని బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించాడు. అయితే ఈ మూవీని దర్శకుడు ముందుగా బన్నీతో తీయాలి అనుకున్నాడంట. కానీ అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని డేట్స్ కుదరకపోవడంతో రిజక్ట్ చేయడంతో ఈ ఛాన్స్ రవితేజకు వెళ్లింది. ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

విక్రమార్కుడు మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. రవితేజ అద్భుతమైన సినిమాల్లో ఇదొక్కటి. ఈ మూవీలో రవితేజ సరసన , అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించిది. అయితే ఈ మూవీని ముందుగా రాజమౌళి పవన్ కళ్యాణ్‌తో తీయాలి అనుకున్నాడంట. కానీ పవర్ స్టార్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో రవితేజతో మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

ఇవే కాకుండా మిరపకాయ్ మూవీ కూడా పవన్ రిజక్ట్ చేయడంతో రవితేజ ఛాన్స్ కొట్టేసి, మూవీ చేశారు. అదే విధంగా, రవితేజ సూపర్ హిట్ మూవీల్లో ఒక్కటైన, కిక్ మూవీని ముందుగా దర్శకుడు సురేందర్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్‌తో తియ్యాలి అనుకున్నాడంట. కానీ తారక్ రిజక్ట్ చేయడంతో ఈ సినిమా రవితేజతో తీసి హిట్ అందుకున్నాడు.