Mangalavaaram 2: మంగళవారం సీక్వెల్ రంగం సిద్ధం.. ఓ అగ్ర హీరోయిన్ ప్రధాన పాత్రలో..

Edited By: Prudvi Battula

Updated on: Apr 26, 2025 | 2:40 PM

కొన్ని సినిమాలు తెలియకుండానే చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. ఆడియన్స్‌లో ఆసక్తి రేపుతుంటాయి. అలాంటి ఓ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. రెండేళ్ళ కింద విడుదలైన మంగళవారం సినిమా వితౌట్ ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే హిట్ కొట్టింది. దాని సీక్వెల్ కథేంటి..? ఎంత వరకు వచ్చింది.? 

1 / 5
కార్తికేయ, పాయల్ రాజపుట్ హీరోహీరోయిన్లుగా ఆర్ఎక్స్ 100 లాంటి సెన్సేషనల్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు అజయ్ భూపతి. అయితే ఆర్ఎక్స్ 100 తర్వాత అదే టెంపో కంటిన్యూ చేయలేకపోయారీయన. 

2 / 5
మంచి అంచనాలతో వచ్చిన మహా సముద్రం దారుణంగా ఫ్లాప్ అయింది. శర్వానంద్, సిద్దార్థ్, అదితిరావు హైదరి, అను  అదిరిపోయే క్యాస్టింగ్ ఉన్నా.. అస్సలు కథ లేకపోవడంతో మునిగిపోయింది మహా సముద్రం.

3 / 5
మహా సముద్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని అజయ్ భూపతి చేసిన సినిమా మంగళవారం. పాయల్ రాజ్‌పుత్ కీలక పాత్రలో వచ్చిన ఈ చిత్రం అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయం సాధించింది.

4 / 5
2023లో వచ్చిన ఈ సినిమాకు అజినీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ బలం. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నారు అజయ్. ఏడాదిగా ఈ స్క్రిప్ట్‌పైనే బిజీగా ఉన్నారీయన. మంగళవారం హిట్టైనా.. A సర్టిఫికేట్ సినిమా. అందుకే పార్ట్ 2తో పూర్తిగా ఫ్యామిలీస్‌ను టార్గెట్ చేస్తున్నారు అజయ్ భూపతి.

5 / 5
ఓ అగ్ర హీరోయిన్ నటించబోతున్న మంగళవారం 2ను పెద్ద ప్రొడక్షన్ హౌజ్ నిర్మించబోతుంది. పూర్తి డివోషనల్ టచ్‌తో ఈ సినిమా రానుంది. మరి మంగళవారం 2తో అజయ్ మరో హిట్ కొడతారా లేదా అనేది చూడాలి.