
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్ బాబు కూతరు, నటి మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ముద్దుగుమ్మల్లో ఈ బ్యూటీ ఒకరు. అంతే కాకుండా నిత్యం ఏదో ఇక వీడియో షేర్ చేస్తూ తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటుంది.

ఈ చిన్నది అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టి మొదటి మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ బ్యూటీ ఈ మూవీలో తన నటనకు గాను, నందీపురస్కారం అందుకుంది.

ఇక ఈ మూవీ తర్వాత వరసగా సినిమాలు చేసి, తన నటనతో అందరి మనసు దోచేసింది. ప్రస్తుం సినిమాల్లో నటించడం కంటే, నిర్మాతగా మారి ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.

మంచు లక్ష్మీ తెలుగులోనే కాకుండా తమిళ్ , మళయాలం వంటి భాషల్లో కూడా నటించింది. విలన్ పాత్రల్లో కూడా నటించి, తన నటనతో అందరినీ మెప్పించింది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోస్ షేర్ చేసే ఈ ముద్దుగుమ్మ, తాజాగా మంత్రి కొండా సురేఖ నివాసంలో ఇష్కాన్ ఆధ్వర్యంలో గోమాత పూజలు చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.