- Telugu News Photo Gallery Cinema photos Mamitha Baiju deepika padukone nayanthara remuneration details
హీరోల రేంజ్‌లో హీరోయిన్ల డిమాండ్స్.. ఏ మాత్రం తగ్గేదేలే అంటున్న ముద్దుగుమ్మలు
నిన్న మొన్నటి వరకు హీరోల రెమ్యూనరేషన్ విషయంలోనే డిస్కషన్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. హీరోయిన్లు కూడా భారీగా రేటు పెంచేస్తున్నారు. సినిమా రేంజ్‌కు తగ్గట్టుగానే తమ పారితోషికం కూడా ఉండాలని పట్టుబడుతున్నారు. గత చిత్రానికి తీసుకున్న నెంబర్స్‌కు ఏమాత్రం సంబంధం లేని రేంజ్‌లో ఉన్నాయి హీరోయిన్ల డిమాండ్స్.
Updated on: May 15, 2025 | 6:58 PM

నార్త్ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్న దీపిక పదుకోన్ ఆ మూవీస్‌కి పెద్దగా డిమాండ్స్ లేకుండానే పేమెంట్ తీసుకుంటున్నారు. కానీ మరోసారి డార్లింగ్‌తో జోడీ కట్టేందుకు మాత్రం భారీ పేచెక్ కావాల్సిందే అని పట్టు బట్టారట ఈ బ్యూటీ.

ప్రజెంట్ పది కోట్లకు కాస్త అటు ఇటుగానే పారితోషికం అందుకుంటున్నారు దీపిక. కానీ స్పిరిట్ సినిమాకు మాత్రం 20 కోట్లు ఇవ్వాల్సిందే అంటున్నారట ఈ బ్యూటీ.

నయనతార కూడా పారితోషికం విషయంలో కాస్త గట్టిగానే ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కబోయే సినిమాలో నయనతారను హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నారు.

అయితే ఈ సినిమాలో నటించేందుకు.. నయన్, 18 కోట్ల డిమాండ్ చేశారన్న ప్రచారం జరిగింది. అయితే అంత కాకపోయినా.. భారీగానే నయన్‌కు పే చేస్తున్నారట చిత్రయూనిట్.

టాప్ బ్యూటీసే కాదు కొత్త హీరోయిన్లు కూడా పేమెంట్ విషయంలో తగ్గేదే లే అంటున్నారు. ప్రేమలు సినిమాతో నేషనల్ సెన్సేషన్‌గా మారిన మమితా బైజు తన పారితోషికాన్ని డబుల్ చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రేమలు టైమ్‌లో పాతిక లక్షల పేమెంట్ తీసుకున్న మమితా... ఇప్పుడు ఏకంగా రెండు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారన్నది ఇండస్ట్రీ టాక్.




