
అతి తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన హీరోయిన్ మాళవిక మోహనన్. 2013లో బట్టం బోలే సినిమాతో మలయాళీ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించిన పెట్టా చిత్రంలో కనిపించింది. ఈ మూవీతో తమిళం ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంది

ధనుష్, విజయ్ దళపతి వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన మాళవిక.. ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రం తర్వాత మాళవిక టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తుందేమో చూడాలి.

ఇదిలా ఉంటే గతంలో ఇండస్ట్రీలలో హీరోయిన్స్ పట్ల వచ్చే ట్రోల్స్, విమర్శలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.చాలా సన్నగా ఉండడం వల్ల మలయాళంలో తాను ట్రోల్స్ ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. తెలుగు, తమిళంలో సన్నగా ఉన్న కాంప్లిమెంట్స్ వస్తాయని.. కాస్త లావుగా ఉన్న కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది.

కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించాలంటే స్లిమ్ గా ఉండాల్సిందేనని.. అక్కడ ఫిట్నెస్ కు చాలా డిమాండ్ ఉంటుందని తెలిపింది. భారతీయ సినిమాలో రకరకాల ప్రమాణాలు ఉన్నాయని.. బరువు తగ్గినా, స్లిమ్ అయినా తెలుగు, తమిళంలో కాంప్లిమెంట్స్ మాత్రం వస్తాయని.. మలయాళంలో మాత్రం బొద్దుగా ఉంటే బాగుంటుందని చెబుతారని తెలిపింది.

మాళవిక చివరిసారిగా తంగళాన్ చిత్రంలో నటించింది. చియాన్ విక్రమ్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. అలాగే సిద్ధాంత్ చతుర్వేది సరసన హిందీ యాక్షన్ చిత్రం ‘యుద్ర’లో కూడా నటించింది. మాళవిక రాబోయే ప్రాజెక్ట్‌లలో తమిళ స్పై థ్రిల్లర్ ‘సర్దార్ 2’, రొమాంటిక్ కామెడీ హారర్ చిత్రం ‘ది రాజా సాబ్’ ఉన్నాయి.