
పట్టం పోల్ అనే మళయాళీ చిత్రంతో కథానాయకిగా ఇండస్ట్రీలో అడుపెట్టింది మాళవిక మోహనన్.

తర్వాత పేట, మాస్టర్, మారన్ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ సరసన రాజా డీలక్స్ చిత్రంలో నటిస్తుంది.

తాజాగా ఇండస్ట్రీలో గుర్తింపు గురించి మాట్లాడింది ఈ భామ.

స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తేనే గుర్తింపు వస్తుందని అన్నారు హీరోయిన్ మాళవిక మోహనన్.

పాత మలయాళ సినిమాలను తన తల్లి ఎక్కువగా చూసేవారని చెప్పారు.

అప్పట్లో హీరోయిన్లు మంచి పాత్రలు చేస్తే అభినందించేవారని, అలా తాను కూడా చేయాలని సూచించేవారన్నారు.

ఆ మాటలకు అర్థం ఇప్పుడు తెలుస్తోందని, ఇకపై అలాంటి పాత్రలు సెలక్ట్ చేసుకుంటానని అన్నారు మాళవిక.