
పుష్ప 2తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన అల్లు అర్జున్, నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను అంతకు మించి అన్న రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో గ్లోబల్ రేంజ్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నట్టుగా ఆల్రెడీ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమా కాస్టింగ్‌కు సంబంధించిన న్యూస్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

గ్లోబల్ ప్రాజెక్ట్ కాబట్టి హీరోయిన్‌గా ప్రియాంక చోప్రాను తీసుకునే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం జరిగింది. తరువాత త్రిష, దిశా పాఠ్ని లాంటి బ్యూటీస్ పేర్లు కూడా తెర మీదకు వచ్చాయి. ఓ దశలో బన్నీ లక్కీ బ్యూటీ సమంత ఆల్మోస్ట్ ఫిక్స్ అన్న టాక్ వినిపించింది.

లేటెస్ట్ అప్‌డేట్‌లో లిస్ట్ అంతా మారిపోయింది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్ల కనిపించబోతున్నారు. ఒక హీరోయిన్‌గా మృణాల్ కన్ఫార్మ్ అయ్యారన్నది నయా అప్‌డేట్, రీసెంట్‌గా లుఖ్ టెస్ట్‌లోనూ పాల్గొన్నారట ఈ బ్యూటీ.

మిగిలిన ఇద్దరు హీరోయిన్లు ఎవరన్న విషయంలో ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఒక హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటించే ఛాన్స్ కనిపిస్తోంది. ఆల్రెడీ జాన్వీతో డిస్కషన్ కూడా పూర్తయ్యాయన్నది ఇన్‌సైడ్ టాక్.

మరో హీరోయిన్‌గా దీపికను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ అట్లీ తెరకెక్కించిన జవాన్‌లో కీలక పాత్రలో నటించారు దీపిక.. అందుకే మరోసారి ఆమెను రిపీట్ చేసే ప్లాన్‌లో ఉన్నారు ఈ క్రేజీ డైరెక్టర్.