హీరో ఎలివేషన్‌ను పర్ఫెక్ట్‌గా క్యాష్ చేసుకుంటున్నారు దర్శకులు. ముఖ్యంగా టాప్ స్టార్స్‌కు ఫ్యాన్స్‌గా మారుతున్న మేకర్స్, తన అభిమాన నటులను లార్జర్ దన్ లైఫ్ రేంజ్‌లో ప్రజెంట్ చేస్తున్నారు. ప్రజెంట్ సలార్ సక్సెస్ తరువాత అలా హీరో ఎలివేషన్ మీదే సూపర్ హిట్ అయిన సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు.
సలార్ సినిమాలో ప్రభాస్ ఎలివేషన్ నెక్ట్స్ లెవల్‌లో ఉండటంతో డార్లింగ్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఛత్రపతి, మిర్చి లాంటి సినిమాల తరువాత ప్రభాస్‌ను ఆ రేంజ్‌లో యూజ్ చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీలే అంటున్నారు డైహార్డ్ ఫ్యాన్స్.
రీసెంట్ బ్లాక్ బస్టర్ జైలర్ కూడా కేవలం హీరో ఎలివేషన్ మీదే సక్సెస్ అయ్యింది. రజనీని ఓల్డ్ ఏజ్ లుక్‌లో చూపిస్తూనే మాస్ హీరోగా ప్రజెంట్ చేశారు దర్శకుడు నెల్సన్ దిలీప్. ఈ సినిమాతో రజనీ బౌన్స్ బ్యాక్ అవ్వటమే కాదు కోలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను స్టార్ట్ చేశారు.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూడా యాక్టింగ్‌తో పాటు ఎలివేషన్ మీద దృష్టిపెట్టారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ విక్రమ్‌లో హీరోయిజాన్ని పీక్స్‌లో చూపించిన కమల్, నెక్ట్స్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కబోయే థగ్ లైఫ్ సినిమాలోనూ అదే టెంపోను మెయిన్‌టైన్ చేస్తున్నారు.
అసలు ఈ ట్రెండ్‌ను ఈ జనరేషన్‌లో గ్రాండ్‌గా రీస్టార్ట్ చేసిన మూవీ కేజీఎఫ్. ఇతర భాషల్లో అస్సలు పరిచయం లేని యష్ లాంటి హీరోను కూడా పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి ప్రశాంత్ ఎలివేషన్స్. అందుకే అప్ కమింగ్ సినిమాల్లోనూ ఇదే ఫార్ములాను కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.