
మనం స్టార్ట్ చేసిన సినిమా రిలీజ్ అయ్యాక రిజల్ట్ ఎలా ఉండాలంటే, సెకండ్ మూవీ కోసం ప్యాన్ ఇండియా డిస్ట్రిబ్యూటర్లు వెయిట్ చేయాలి. అడ్వాన్సులు తీసుకోండి అంటూ క్యూ కట్టాలి. తీసేది ఎంత చిన్న సినిమా అయినా, మేకర్స్ కంటున్న కలలు ఇప్పుడు అచ్చం ఇలాగే ఉంటున్నాయి. ఫస్టు పార్టుగా చిన్నగా స్టార్ట్ చేసి, సెకండ్ పార్టుకు ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఎదిగిన మేకర్స్ గురించి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నారు.

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సినిమా తెరకెక్కినప్పుడు అదో మామూలు సినిమా. కాకపోతే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ. ఆ సినిమా కలెక్షన్లు చూశాక దిమ్మ తిరిగిపోయింది జనాలకు. సెకండ్ పార్టును ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్ చేశారు మేకర్స్. మళ్లీ అక్కడ కూడా ప్రూవ్ చేసుకుని కంటెంట్ ఉంటే సరిహద్దులు చెరిగిపోవడం గ్యారంటీ అని ప్రూవ్ చేసింది కార్తికేయ2.

ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ విషయంలోనూ ఇదే ఫార్ములా రిపీట్ అవుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు జనాలు. అప్పటిదాకా చాక్లెట్ బోయ్ ఇమేజ్ ఉన్న రామ్‌ని, పక్కా మాస్ హీరోగా మార్చి తెరకెక్కించిన సినిమా ఇస్మార్ట్ శంకర్.

అంత ట్రాన్స్ ఫర్మేషన్‌ని జనాలు ఎలా రిజీవ్ చేసుకుంటారోననే దిగులే అక్కర్లేకుండా పోయింది పూరికి. గీసిన స్కెచ్ పక్కాగా వర్కవుట్ అవడంతో, ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ ని ప్యాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

గూఢచారి పరిస్థితి కూడా ఇంతే. అడివి శేష్ హీరోగా నటించిన ఆ సినిమా తెలుగు ఆడియన్స్ కి భీభత్సంగా నచ్చేసింది. జస్ట్ మల్టీప్లెక్స్ మూవీ అవుతుందని మొదట్లో టాక్ వినిపించినా, మాస్ ప్రేక్షకులను కూడా మెప్పించింది. దాని ఫలితమే ఇప్పుడు గూఢచారి సీక్వెల్‌కి... ప్యాన్ ఇండియా రేంజ్ రిలీజ్ ప్లానింగ్ జరగడం.