
ఇంటర్నేషనల్ రేంజ్ ప్రాజెక్ట్ కావడంతో ఆచి తూచి అన్నిటినీ సెట్ చేసేసరికి ఇన్నాళ్లూ పట్టిందంటోంది జక్కన్న కాంపౌండ్. ఎంత ఖర్చయినా ఫర్వాలేదంటూ రంగంలోకి దూకుతున్నారు మేకర్స్.

ఎట్టి పరిస్థితుల్లో 2026 చివర్లో మహేష్ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు జక్కన్న. రెండేళ్ళలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలనేది దర్శక ధీరుడి ప్లాన్. మరి అది వర్కవుట్ అవుతుందా లేదా చూడాలి.

రాజమౌళి తీరు చూస్తుంటే ఇప్పట్లో అప్‌డేట్ అయితే చెప్పేలా కనిపించట్లేదు. ఆయన చెప్పకపోయినా.. ఏదో ఓ రూపంలో సినిమా అప్‌డేట్స్ అయితే బయటికి వస్తున్నాయి. టీం అందరితో కూర్చుని డిస్కస్ చేసి.. అందరి అభిప్రాయాలు అడిగాకే మహేష్‌తో అడ్వంచరస్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి.

ఎలాగూ మహేష్‌తో చేయబోయేది అడ్వంచరస్ యాక్షన్ డ్రామానే కాబట్టి గతంలో కృష్ణ చేసిన మొసగాళ్లకు మోసగాడు లాంటి సినిమాల్లోని పాత్రలను మళ్లీ రీ క్రియేట్ చేసే స్కోప్ ఉంటుందన్నది ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. మరి ఈ విషయంలో రాజమౌళి ప్లానింగ్ ఏంటో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇంకా మొదలు కాని ఎస్ ఎస్ ఎంబీ 29 రిలీజ్ డేట్ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది నెట్టింట్లో. ఏవేవో లింకులు తీసి నాన్‌స్టాప్‌గా ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో టాప్‌లో వైరల్ అవుతోంది ఈ మూవీ న్యూస్. ఇంతకీ ట్రెండ్ అవుతున్న విషయాలు పాతవేనా? కొత్తవి ఏవైనా ఉన్నాయా?