Film Updates: మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సెట్స్‌లో అడుగు పెట్టిన స్వీటీ..

| Edited By: Prudvi Battula

Mar 13, 2024 | 10:19 AM

మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు థమన్. అనుష్క శెట్టి చాలా రోజుల తర్వాత సెట్స్‌కు వచ్చారు. కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగానే ఉన్న స్వీటీ. సమంత మరోసారి కొత్త ఫోటోషూట్‌తో రెచ్చిపోయారు. ఈమె ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయిప్పుడు. అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ జంటగా అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'శివం భజే’. ‘కేరింత’ సినిమాలో నూకరాజుగా అలరించిన పార్వతీశం హీరోగా వస్తున్న సినిమా ‘మార్కెట్ మహాలక్ష్మి’.

1 / 5
మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు థమన్. గుంటూరు కారం సినిమాలో 7వ పాట కూడా ఉంది. మార్చి 15న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు థమన్. ఇది తనకు ఇష్టమైన పాట అని తెలిపారు ఈ సంగీత దర్శకుడు. లిరికల్ వీడియోను కూడా విడుదల చేయబోతున్నారు థమన్. ఈ పోస్ట్‌తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

2 / 5
అనుష్క శెట్టి చాలా రోజుల తర్వాత సెట్స్‌కు వచ్చారు. కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగానే ఉన్న స్వీటీ.. తాజాగా కథనార్ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. మలయాళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జయసూర్య హీరోగా నటిస్తున్నారు. రోజిన్ థామస్ ఈ సినిమాకు దర్శకుడు.

3 / 5
సమంత మరోసారి కొత్త ఫోటోషూట్‌తో రెచ్చిపోయారు. ఈమె ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయిప్పుడు. గ్లామర్ డోస్ రోజురోజుకీ పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు స్యామ్. ఈ క్రమంలోనే కొత్త ఫోటోషూట్ కూడా వైరల్ అవుతుంది. ప్రస్తుతం తెలుగు కంటే బాలీవుడ్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేసారు సమంత.

4 / 5
అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ జంటగా అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'శివం భజే’. తాజాగా ఈ చిత్ర టైటిల్ ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఇందులో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జై చిరంజీవ తర్వాత తెలుగులో అర్బాజ్ నటిస్తున్న సినిమా ఇదే.

5 / 5
‘కేరింత’ సినిమాలో నూకరాజుగా అలరించిన పార్వతీశం హీరోగా వస్తున్న సినిమా ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రణీకాన్వికా హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని తెలిపారు దర్శక నిర్మాతలు.