
రియల్ సక్సెస్ అంటే ఎలా ఉంటుందో అప్పుడప్పుడూ జనాలకు గుర్తుచేయడానికి రిలీజ్ అవుతుంటాయి కొన్ని సినిమాలు. ఇప్పుడు మహావతార్ నరసింహ గురించి కూడా ఇలాగే మాట్లాడుతున్నారు జనాలు. ఈ యూనివర్శ్‌లో వచ్చే నెక్స్ట్ సినిమాలకు ఈ సక్సెస్ చెబుతున్నదేంటి?

కాంతార సినిమా సైలెంట్ హిట్ అయినప్పుడు అందరూ వావ్ అన్నారు. ఇప్పుడు మహావతార్ నరసింహ చూసి వాట్ ఎ మూవీ అంటున్నారు. 300 కోట్లను దాటి 400 కోట్ల వైపు పరుగులు తీస్తోందీ సినిమా.

ఈ యూనివర్శ్‌లో రిలీజ్ అయ్యే నెక్స్ట్ సినిమాలకు టఫ్ టార్గెట్ ఫిక్స్ చేసేసింది. మహావతార్ నరసింహ సినిమాను ప్రకటించినప్పుడే.. నెక్స్ట్ ప్లానింగ్‌ని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్.

2027లో పరశురామ్.. 2029లో రఘునందన్.. 2031లో ద్వారకాదీష్.. 2033లో గోకులానంద.. 2035లో కల్కి పార్ట్ 1.. 2037లో కల్కి పార్ట్ 2 విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. యానిమేషన్ నేపథ్యంలో ఈ సినిమాలన్నీ రానున్నాయి.

మహావతార్ నరసింహలో గ్రాఫిక్స్ క్వాలిటీ చూసిన వారు.. నెక్స్ట్ ఇదే రేంజ్‌లో గనుక యానిమేషన్ సినిమాలను సిల్వర్ స్క్రీన్ మీదకు తీసుకురాగలిగితే, మన పురాణాలను నెక్స్ట్ జనరేషన్‌కి ఇంట్రస్టింగ్‌గా చెప్పగలిగితే బాక్సాఫీస్ దగ్గర కాసుల గలగలలు ఖాయం అంటున్నారు క్రిటిక్స్.