చూస్తున్నారుగా.. డీడీ అండ్ బ్యాచ్ మరోసారి వచ్చేసారు. ఏడాదిన్నర కింద ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా మ్యాడ్. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకుడు.
నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా కంటిన్యూ అయ్యారు.. కమెడియన్ విష్ణు వాళ్లకు తోడున్నారు.. ఈసారి స్టోరీ అంతా లడ్డూ చుట్టూనే తిరుగుతుంది.
మ్యాడ్ స్క్వేర్ అనౌన్స్ చేసిన రోజు నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. మ్యాడ్ ఇచ్చిన ఎంటర్‌టైన్మెంట్ కంటే.. మ్యాడ్ స్క్వేర్‌లో డబుల్ డోస్ ఉంటుందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది.
ఫ్రెండ్ పెళ్లికి వచ్చి.. ఆ తర్వాత గోవా ట్రిప్ వెళ్తారు హీరో అండ్ బ్యాచ్. అక్కడ జరిగిన ఫన్నీ మూవెంట్సే మ్యాడ్ స్క్వేర్ కథ. మ్యాడ్ అంతా కాలేజ్‌లోనే జరిగే కథ.. కానీ సీక్వెల్‌లో కథ స్పాన్ పెరిగిందని అర్థమవుతుంది.
మ్యాడ్‌లో ముగ్గురు హీరోయిన్స్ ఉంటే.. సీక్వెల్‌లో అసలు హీరోయిన్సే లేరు. కేవలం హీరోల అల్లరి ఉండబోతుంది. మార్చి 28న మ్యాడ్ స్క్వేర్ విడుదల కానుంది. మరి ఈసారి డీడీ అండ్ బ్యాచ్ చేయబోయే రచ్చ ఎలా ఉండబోతుందో చూడాలిక.