
ప్రముఖ బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే హఠాన్మరణం అందరికీ షాక్‌కు గురిచేసింది. గర్భాశయ క్యాన్సరే పూనమ్‌కు బలి తీసుకుందని ఆమె టీమ్ తెలిపింది. అయితే ఈ క్యాన్సర్ మహమ్మారిని చిరునవ్వుతో ఎదుర్కొని జయించిన సెలబ్రెటీలు చాలా మందే ఉన్నారు.

క్యాన్సర్ మహమ్మారిని జయించిన వారిలో ముందుగా చెప్పాలంటే 'బొంబయి' ముద్దుగుమ్మ మనీషా కొయిరాలా గురించే చెప్పాలి. మనీషా కొయిరాలా 2012లో అండాశయ క్యాన్సర్ బారినపడ్డారు. మూడేళ్ల చికిత్స అనంతరం 2015లో ఆమె క్యాన్సర్‌ను జయించారు.

మహేష్ నటించిన మురారి సినిమాతో తెలుగు ఆడియెన్స్‌ను పలకిరించింది సోనాలి బింద్రే. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిన సొనాలి మెటాస్టాటిక్ క్యాన్సర్ బారిన పడింది. అయితే ధైర్యంగా ఈ మహమ్మారితో పొరాడింది. చికిత్స తీసుకుని కోలుకుంది.

అందాల తార మమతా మోహన్ దాస్ కూడా క్యాన్సర్ మహమ్మారిని జయించారు. 2009 హాడ్కిన్ లింఫోమా అనే క్యాన్సర్ బారిన పడిన ఆమె చికిత్స తీసుకుని ఎంతో దైర్యంగా ఆ వ్యాధి నుంచి బయటపడ్డారు.

హంసానందిని.. హీరోయిన్‌గా, ఆ తర్వాత స్పెషల్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ తో తెలుగులో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హంసా నందిని. 2020 జూలై నెలలో తనకు గ్రేడ్ 3 కార్సినోమా ఉన్నట్లు తెలుసుకున్న ఆమె అందుకు తగ్గట్గుగా ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. క్రమంగా కోలుకున్నారు.

అలనాటి అందాల తార గౌతమి కూడా క్యాన్సర్ ను జయించారు. గౌతమి బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడ్డారు. ఆతర్వాత ఆమె ఆ మహమ్మారిని జయించారు.

వీరితో పాటు నటుడు సంజయ్ దత్, ఆయుష్మాన్ ఖురానా సతీమణి తహీరా కశ్యప్, నిర్మాత అనురాగ్ బసు, నటి నఫీసా, రాకేశ్ రోషన్, లిసారే, మహిమా చౌదరి, కిరణ్ ఖేర్ తదితర ప్రముఖులు వివిధ రకాల క్యాన్సర్లకు ఎదురొడ్డి పోరాడిన వారే.