
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని మాస్కో ప్రభుత్వ ప్రతినిధులు పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు సినిమాలతో, రష్యన్ క్రియేటివ్ ఇండస్ట్రీ కొలాబరేషన్ గురించి మెగాస్టార్‌తో చర్చించారు. రష్యాలో తెలుగు సినిమాల షూటింగులు జరిగేలా ప్రోత్సహించేందుకు తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు.

My Dear Donga: అభినవ్ గోమటం కీలక పాత్రలో నటించిన చిత్రం మై డియర్ దొంగ. అచ్చ తెలుగు ఓటీటీ ఆహాలో విడుదలైంది. మంచి ప్రాజెక్టులో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు అభినవ్ గోమటం. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఆహా సపోర్ట్ చేసే తీరు అద్భుతంగా ఉందని చెప్పారు.

Pottel: యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా పొట్టెల్. ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విడుదల చేశారు. టీజర్ చాలా బావుంది. ఇలాంటి సినిమాలు తక్కువగా వస్తుంటాయి. సినిమాను తొలి రోజు చూడాలని ఉందని అన్నారు సందీప్‌రెడ్డి వంగా. మంచి సందేశం ఉన్న చిత్రమని అన్నారు మేకర్స్.

Sekhar Kammula: సిద్ధాంతాలు, విలువలు పాటించి సినిమాలు తీస్తానని అన్నారు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల. హ్యాపీడేస్‌కి సీక్వెల్ చేద్దామని తనకు అనిపించిందని, కానీ కథ కుదరలేదని అన్నారు. పేరు, డబ్బు కోసం తాను సినిమా రంగానికి రాలేదని చెప్పారు. వాటికోసం ఎప్పుడూ సినిమాలు తీయలేదని తెలిపారు. అదే తనకు గర్వంగా ఉంటుందని చెప్పారు శేఖర్ కమ్ముల.

Lingusamy: ఉత్తమ విలన్ సినిమా వల్ల తాము ఎంతగానో నష్టపోయామని అన్నారు డైరక్టర్ లింగుస్వామి. సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడు కమల్ పదే పదే కథ మార్చేసేవారని చెప్పారు. దీని వల్ల ఖర్చు భారీగా పెరిగిందని అన్నారు. ప్రేక్షకుల్లో పెరిగిన అంచనాలను అందుకోలేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయిందని అన్నారు.