
అయినా, ఎలాగోలా ప్రాజెక్టులో భాగం కావాలని అనుకున్నారట. ఆ విషయమే చెబితే, బుజ్జి రోల్‌కి వాయిస్ ఇవ్వమని బంపర్ ఆఫర్ ఇచ్చారట. యాహూ అంటూ ప్రాజెక్టును ఓకే చేసేశానని అంటున్నారు కీర్తీ.

వింటున్నారుగా.. కల్కి సినిమాలో ప్రభాస్ తనకి జోకర్‌లా కనిపించారని.. అమితాబ్ బచ్చన్ మాత్రం అద్భుతం అంటూ పొగిడేసారు అర్షద్ వార్షి. ఓ సినిమా నచ్చలేదని చెప్పే ఫ్రీడమ్ అందరికీ ఉంటుంది కానీ చెప్పే విధానం ఒకటుంటుంది.

సాహోరే బాహుబలి అంటూ ఇప్పటికీ హిందీ మార్కెట్‌లో నెంబర్ వన్ కలెక్షన్లున్న సినిమాగా బాహుబలి2నే గౌరవిస్తున్నారు. ఆ నెక్స్ట్ ప్లేస్ నాదేనండీ అంటూ సైలెంట్‌గా కేజీయఫ్2తో ఖర్చీఫ్ వేసేశారు ప్రశాంత్ నీల్.

సౌత్ నుంచి కీర్తీ సురేష్ కల్కి గురించి మాట్లాడుతుంటే, నార్త్ నుంచి ఈ బాధ్యతను శ్రద్ధాకపూర్ తీసుకున్నారు. స్త్రీ2తో ఆగస్టు 15న ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు.

తాజాగా ప్రభాస్‌పై అర్షద్ వార్షి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు వాళ్లకెందుకు అంత కడుపుమంట..? కరోనా తర్వాత నార్త్‌పై సౌత్ డామినేషన్ మొదలైంది.. ఒక్కముక్కలో చెప్పాలంటే టాలీవుడ్ దండయాత్ర నడుస్తుందిప్పుడు.

డార్లింగ్ ప్రభాస్‌కి సౌత్‌లో ఎంత చరిష్మా ఉందో, అంతకు మించిన ఇమేజ్ నార్త్ లోనూ ఉందని ప్రూవ్ చేసింది సాహో మూవీ. ఇప్పుడు కల్కి సినిమాకు హిందీలో వస్తున్న కలెక్షన్లు చూసి 'మా వాడు గ్రేటెహే' అని మరోసారి కాలర్ ఎగరేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

అభిమానులు ప్రభాస్‌ని దేవుడిలా చూస్తారంటూ రీసెంట్‌గా అమితాబ్ చెప్పిన మాటలను కూడా పనిలో పనిగా వైరల్ చేస్తున్నారు రెబల్ సైనికులు.