- Telugu News Photo Gallery Cinema photos Lavanya Tripathi Touches Chiranjeevi And Satyanand Feet In Her Reception, See Photos
Varun Tej- Lavanya Tripathi: మెగా కోడలి సంస్కారానికి ఫిదా.. రిసెప్షన్‌లో ఆ ఇద్దరి కాళ్లకు మొక్కిన లావణ్య.. ఫొటోస్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి తమ జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టారు. నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీ వేదికగా ఈ ప్రేమ పక్షుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మెగా, అల్లు కుటుంబ సభ్యులు, లావణ్య ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు హాజరయ్యారు.
Updated on: Nov 06, 2023 | 5:46 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి తమ జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టారు. నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీ వేదికగా ఈ ప్రేమ పక్షుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మెగా, అల్లు కుటుంబ సభ్యులు, లావణ్య ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు హాజరయ్యారు.

ఇక వరుణ్-లావణ్యల వివాహానికి హాజరుకాని వారి కోసం ఆదివారం (నవంబర్ 5) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ రిసెప్షన్ పార్టీలో సందడి చేశారు.

రిసెప్షన్ పార్టీలో గోల్డ్ కలర్ శారీలో ట్రెడిషినల్ లుక్‌తో సింపుల్‌గా కనిపించింది లావణ్య త్రిపాఠి. నుదుటున సింధూరం మెగా కోడలి అందాన్ని మరింత పెంచేసింది.

ఇక రిసెప్షన్ పార్టీకి వచ్చిన అతిథులందరితోనూ ఎంతో ఓపికగా ఫొటోలు దిగారు నూతన వధూవరులు. అయితే ఇక్కడే అభిమానుల మనసులు గెల్చుకుంది మెగా కోడలు. తమను ఆశీర్వదించడానికి వచ్చిన చిరంజీవి కాళ్లు మొక్కి దీవెనలు అందుకుంది లావణ్య.

అలాగే సినీ పరిశ్రమలో ఎంతో మంది నటీనటులకు శిక్షణ ఇచ్చిన సత్యానంద్ పాదాలకు నమస్కరించింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. మెగా కోడలి వినయం, విధేయత, పెద్దల పట్ల గౌరవాన్ని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.