
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరిగా జవాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నయన్.

ప్రస్తుతం కుటుంబంతో కలిసి వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే.. తన భర్త, పిల్లలతో కలిసి సమయం గడుపుతుంది నయనతార.

ఎప్పుడు నెట్టింట యాక్టీవ్ గా ఉంటూ.. ఫ్యామిలీ, పిల్లల విషయాలు పంచుకుంటూ ఉంటుంది నయన్..

గతంలో కొన్ని రోజులుగా లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ విడాకుల వార్తలు హల్చల్ అయ్యిన సంగతి తెలిసిందే.

ఓవైపు వరుస సినిమాలు.. మరోవైపు 9Skin అంటూ వ్యాపార రంగంలో బిజీగా ఉన్న నయన్… తాజాగా కొత్త సందేహాలకు తెర తీసింది.

అంతే కాదు ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో నయన్ ఒకరు. ఈ అమ్మడు ఏకంగా 10 కోట్లవరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది.