Sai Pallavi: హీరోయిన్స్ లో కల్లా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి వింటేజ్ వేరు.. ఫొటోస్ వైరల్.
ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న టాప్ మోస్ట్ హీరోయిన్లలో సాయి పల్లవి ప్రత్యేకమనే చెప్పాలి. ప్రేమమ్ సినిమాతో మలయాళంలో సినీరంగ ప్రవేశం చేసి మలర్ పాత్రలో ఒదిగిపోయింది. తొలి సినిమాతోనే అటు మలయాళీ సినీ ప్రియులను.. ఇటు తెలుగు, తమిళ్ ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసింది. ఆ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.