- Telugu News Photo Gallery Cinema photos Kriti sanon New Photos Goes Attractive in social media on 11 02 2023 Telugu Actors Photos
Kriti Sanon: ఆదిపురుష్ గురించి అస్సలు ఊహించలేదు.. ప్రభాస్ పై తన మాటల్లో ‘కృతి సనన్’.. గ్లామర్ షో.
బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ గురించి కొత్తగా తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయాలు అవసరం లేదు. మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ‘వన్.. నెనొక్కడినే’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది అందాల తార కృతి సనన్.
Updated on: Feb 11, 2023 | 4:28 PM

బాలయ్య ప్రభాస్ ను అడిగింది ఒకటే.. నీ రాణి సనన్‌ఆ.. షెట్టిఆ..? రామ్ చరణ్ చెప్పింది అదే.. సనన్ or షెట్టి! ఇద్దర్లో ఒకరే ప్రభాస్ రాణని ! ఇప్పుడు బాలీవుడ్ చెబుతోంది.. కోడై కూస్తోంది అదే.. ఇద్దర్లో ఒకరనే.. అది కూడా సనన్ అనే.. కృతి సనన్ అనే.!

ఈమె ప్రభాస్ డార్లింగ్ అనే! అయితే ఇది పక్కా న్యూసో.. పనికిమాలిన రూమరో తెలీదు కానీ.. ఎట్ ప్రజెంట్ కృతి చేసిన ఓ కామెంట్ మాత్రం.. ఈ న్యూస్‌కు తెగ స్ట్రెంత్ ఇస్తోంది. ఈ రూమర్ నిజం అవుతుందిరోయ్..! అనే హోప్ డార్లింగ్ ఫ్యాన్స్కు ఇచ్చేస్తోంది.

బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా మారిన ప్రభాస్.. వరుసగా అవే సినిమాలు చేస్తూ పోతున్నారు. లార్జర్ దెన్ లైప్ క్యారెక్టర్స్‌నే ఎంచుకుంటున్నారు. చేస్తున్నారు. ఇక ఆ క్రమంలోనే బాలీవుడ్ లో ఆది పురుష్ సినిమాను మొదలెట్టారు.

ఓం రౌత్ డైరెక్షన్లో.. మోషన్ సెన్సార్ టెక్నాలజీలో రాముడిగా రాబోతున్నారు. ఈ రాముడి పక్కనే సీతగా.. కృతి సనన్ చేస్తున్నారు. వీరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అనే న్యూస్‌తో అప్పటి నుంచే బజ్ చేస్తున్నారు.

ఆ తరువాత బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చేసని కామెంట్తో .. ఇచ్చిన ఓ స్టేట్మెంట్‌తో.. వీరిద్దరూ నిజంగా లవ్‌లో ఉన్నారనే క్లారిటీ అందర్లో కలిగించారు. కాని ఆ తరువాత ఆ హీరో చేసిన కామెంట్ ను అడ్డదిడ్డంగా ఖండించి.. ఇద్దరూ ఇండివిడ్యూవల్స్ అనే టాక్ వచ్చేలా చేశారు.

అయినా కూడా.. లవ్ టాపిక్‌తో వీరిద్దరూ అండర్ గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉన్నారు. బాలీవుడ్ లో బజ్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ కమ్రంలోనే అన్‌స్టాపబుల్లో బాలయ్య ప్రభాస్ ను అడిగిన ప్రశ్నలు.. రామ్ చరణ్ మాటలు.. తెగ వైరల్ అవడంతో.. మరోసారి డార్లింగ్ ఫ్యాన్స్ తెలయని అయోమయంలో పడ్డారు.

ఇంతకీ వీరిద్దరూ లవ్ లో ఉన్నారా.. లేదాని నెట్టింట సెర్చ చేయడం మొదలెట్టారు. ఎక్కడ పడితే అక్కడ చర్చ కూడా పెట్టారు. అయితే ఇదంత ఈజీగా ఓ కొలిక్కి రాదని అందరూ ఫిక్స్ అయిన క్రమంలోనే.. కృతి ప్రభాస్ పై ఇంట్రెస్ట్ కామెంట్స్ చేశారు.

మళ్లీ చర్చను మొదలయ్యలా చేశారు. ఎస్ ! ప్రభాప్ ఆది పురుష్ సినిమాలోని తన సీత రోల్ గురించి తాజాగా మాట్లాడిన కృతి.. ఈ సినిమా తనకు ఖచ్చితంగా మంచి పేరును తెచ్చిపెడుతుందని కాన్ఫిడెంట్‌గా చెప్పారు.

ఆ తరువాత ప్రభాస్ గురించి రిపోర్టర్స్ అడగగానే సిగ్గు తో.. ఎర్రబడిన బుగ్గలతో.. ముసి ముసి నవ్వులు నవ్వుతూ.. ప్రభాస్‌ను పొగిడేశారు. ఇంకా వీళ్ల మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ ఉన్నట్టుందనే పుకార్ను.. మళ్లీ బయటికొచ్చేలా చేశారు.





























