- Telugu News Photo Gallery Cinema photos Kriti Kharbanda Looking Gorgeous At Unveiling Web Series Rana Naidu Season 2 on Netflix
Kriti Kharbanda: అమ్మబాబోయ్..! అందాలతో కేకపెట్టించిన కృతి కర్బందా
కృతి కర్బంద తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. ఇక ఈ అమ్మడు నటనతో పాటు తన అందాలతోనూ ఆకట్టుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో చివరిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ సినిమాలో సిస్టర్ పాత్రలో కనిపించింది. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది.
Updated on: Feb 04, 2025 | 9:45 PM

తెలుగు సినీ పరిశ్రమలో అందం, అభినయంతో అలరించిన హీరోయిన్లలో కృతి కర్బంద ఒకరు. బోణీ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. కానీ ఆ సినిమాతో ఏమాత్రం గుర్తింపు రాలేదు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ చిన్నది.

ఆ తర్వాత అలా మొదలైంది, తీన్మార్, మిస్టర్ నూకయ్య చిత్రాల్లో కనిపించింది. కానీ రామ్ పోతినేని జోడిగా నటించిన ఒంగోలు గిత్త సినిమాతో ఈ బ్యూటీకి పాపులారిటీ వచ్చేసింది. కానీ అంతగా అవకాశాలు మాత్రం రాలేదు.

చాలా కాలంగా తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటుంది కృతి. మొన్నామద్యే తన ప్రియుడు బాలీవుడ్ హీరో పుల్కిత్ సామ్రాట్ తో పెళ్లి చేసుకొని, వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ చిన్నది హిందీ సినిమాల పైనే ఫోకస్ పెట్టింది.

కృతి కర్బంద తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. ఇక ఈ అమ్మడు నటనతో పాటు తన అందాలతోనూ ఆకట్టుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో చివరిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ సినిమాలో సిస్టర్ పాత్రలో కనిపించింది. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది.

ఇక ప్రస్తుతం రానా , వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న రానా నాయుడు సీజన్ 2లో నటిస్తుంది. తాజా రానా నాయుడు 2 టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో కృతి కర్బందా తన అందాలతో ఆకట్టుకుంది. ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.