5 / 5
మార్నింగ్ షోస్ నెమ్మదిగా ఉన్నా.. ఫస్ట్ షో, సెకండ్ షో సమయానికి పుంజుకుంది కోట బొమ్మాలీ. సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. అందుకే ఉదయం, మధ్యాహ్నంతో పోలిస్తే చాలా థియేటర్స్ లో ఆక్యుపెన్సీ బాగా పెరిగింది. మౌత్ టాక్ కూడా జనాల్లోకి బాగా వెళ్లిపోయింది. శనివారం, ఆదివారం నాటికి సినిమా మరింత ప్రేక్షకుల్లోకి వెళ్తుందని నమ్మకంగా ఉన్నారు దర్శక నిర్మాతలు.