Basha Shek |
Dec 05, 2024 | 5:27 PM
లెజెండరీ సింగర్ పి.సుశీలకు మనవడు వరసయ్యే సాయికిరణ్ నువ్వే కావాలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు
ఆ తర్వాత లయతో కలిసి ప్రేమించు సినిమాలో నటించి సోలో హీరోగా సక్సెస్ కొట్టాడు. అలాగే 'మనసుంటే చాలు', 'ఎంత బావుందో' తదితర చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడీ నటుడు.
కొన్ని సినిమాల్లో సహాయక నటుడిగానూ మెప్పించిన సాయి కిరణ్ ఇప్పుడు బుల్లితెరపై బిజీ బిజీగా ఉంటున్నాడు. గుప్పెడంత మనసు, కోయిలమ్మ, పడమటి సంధ్యరాగం సీరియల్స్ అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి
కాగా కొన్ని నెలల క్రితమే తనతో పాటు 'కోయిలమ్మ' సీరియల్‌లో నటించిన స్రవంతితో నిశ్చితార్థం చేసుకున్నాడు సాయికిరణ్.
ప్రస్తుతం తమ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటున్నారు సాయి కిరణ, స్రవంతి. ఈ నేపథ్యంలో కోయిలమ్మ నటి షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోస్ ఇప్పుడు వైరలవుతున్నాయి.