
పిజ్జా సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమైన విజయ్ సేతుపతి ఆ సినిమా కంటే ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం విజయ్ సేతుపతికి 8.2M మిలియన్ మంది ఫాలో అవుతున్నారు.

కానీ విజయ్ సేతుపతి మాత్రం కేవలం ఏడుగురిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. వీరిలో ఒకే ఒక్క అమ్మాయి ఉంది. ఒక్క హీరోయిన్ ను మాత్రమే విజయ్ సేతుపతి ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా..

తను మరెవరో కాదు.. తెలుగమ్మాయి అంజలి. విజయ్ సేతుపతి ఫాలో అవుతున్న లిస్ట్ లో ఉన్న ఏకైక హీరోయిన్ అంజలి. గతంలో వీరిద్దరు కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. తమిళంలో ఐరావి, సింధుబాద్ చిత్రాల్లో కలిసి నటించారు.

విజయ్ ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏడుగురు ఎవరంటే.. లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త డైరెక్టర్ విఘ్నేష్ శివన్, తమిళ్ డైరెక్టర్ మిస్కిన్, హీరోయిన్ అంజలి, కోలీవుడ్ నటుడు రమేష్ తిలక్, కోలీవుడ్ గేయ రచయిత కార్తీక్ నేత, డైరెక్టర్ రంజిత్ జయకోడి, తర్వాత తన సొంత నిర్మాణ సంస్థ విజయ్ సేతుపతి ప్రొడక్షన్స్.

డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఉప్పెన చిత్రంలో ప్రతినాయకుడిగా రాయనం పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు విజయ్ సేతుపతి. ఆ తర్వాత జవాన్ సినిమాతో అటు నార్త్ అడియన్స్ కు దగ్గరయ్యాడు. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.