
స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత 20 ఏళ్లుగా దక్షిణాదిలో వరుస సినిమాలతో అగ్ర కథానాయికగా చక్రం తిప్పుతుంది. తెలుగు, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. ఇప్పుడు తెలుగులో చిరంజీవి జోడిగా విశ్వంభర చిత్రంలో నటిస్తుంది.

నీ మనసు నాకు తెలుసు సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన త్రిష.. ఆ తర్వాత వర్షం సినిమాతో స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఈ మూవీతో త్రిష కెరీర్ మలుపు తిరిగింది. దీంతో ఆమెకు సౌత్ ఇండస్ట్రీలో వరుస అకాశాలు వచ్చాయి. తక్కువ సమయంలోనే స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది.

ఇదెలా ఉంటే.. అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాతో త్రిష బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందట. ఆ సినిమా మరెదో కాదు.. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్). తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన ఈ చిత్రంలో కథానాయికగా ముందుగా అనుష్కను అనుకున్నారట.

కానీ వేరే కారణాలతో అనుష్క ఈ మూవీ నుంచి తప్పుకోగా.. చివరకు త్రిషను సంప్రదించారట. పొన్నియన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ లో రీఎంట్రీ ఇచ్చిన త్రిష.. వెంటనే గోట్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా తమిళనాడులో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత తమిళంలో వరుస సినిమాలతో హిట్స్ అందుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటుంది. నాలుగు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గని అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది ఈ అమ్మడు.