సీనియర్లు కాజల్, తమన్నా, సమంత... ఎవరైనా సరే, ప్రాజెక్టు జరుగుతున్నన్నాళ్లూ మేకర్స్ కి అందుబాటులో ఉండేవారు. సెట్స్ లో ఇతరత్రా కారణాల వల్ల షూటింగ్‌కి బ్రేకులు పడ్డ రోజులున్నాయి కానీ, హీరోయిన్ల కాల్షీట్ లేక ఆగిన సందర్భాలు చాలా అరుదు. వీలైతే ఇతర నిర్మాతలకు నచ్చజెప్పి, సెట్స్ మీదున్న ప్రాజెక్టులను కంప్లీట్ చేసేవారు మన భామలు. కానీ ఇప్పుడు నార్త్ నుంచి వస్తున్న నాయికల్లో అదే కొరవడిందా? అనే టాక్ నడుస్తోంది.