
Nelson Dilipkumar: విజయ్ 69కి సంబంధించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు డైరక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్. ఒకవేళ తాను ఆ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహిస్తే, మహేష్‌బాబు, మమ్ముట్టి, షారుఖ్ ఖాన్‌ని కూడా తీసుకుంటున్నానని అన్నారు నెల్సన్. ఫీమేల్ లీడ్‌లో తన ఫస్ట్ చాయిస్ నయనతార అని చెప్పారు. అయితే విజయ్ 69వ సినిమాకు దర్శకుడు ఎవరనే విషయం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Odela 2: తమన్నా కీలక పాత్రలో నటిస్తున్న సినిమా ఓదెల2. ఈ సినిమా నుంచి తమన్నా వీడియో విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుగుతోంది. ఇందులో శివశక్తి పాత్రలో నటిస్తున్నారు తమన్నా. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముందు కాశీకి వెళ్లి ఈశ్వరుణ్ణి దర్శించుకుని వచ్చారు మిల్కీబ్యూటీ.

Kiara Advani: ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా సలార్2. ఈ సినిమాలో కియారా అద్వానీ ఓ సాంగ్‌కి స్టెప్పులేస్తారనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అందులో నిజం లేదని అంటున్నారు కియారా టీమ్. ఆ సినిమా కోసం కియారాను ఎవరూ అప్రోచ్ కాలేదని చెప్పారు. ప్రస్తుతం ఆమె చేస్తున్న ఏకైక సౌత్ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ అని స్పష్టం చేశారు.

మరోవైపు రెండు హిట్లతో జోరు మీదున్న మృణాళ్ ఠాకూర్‌కు ఫ్యామిలీ స్టార్‌తో తిప్పలు తప్పలేదు. శ్రీలీల, మృణాళ్ సంగతి పక్కనబెడితే.. మీనాక్షి చౌదరి దూకుడు తెలుగులో బాగా కనిపిస్తుందిప్పుడు.

సమంత కొత్త ప్రాజెక్టులకు సంతకం చేసి చాన్నాళ్లే అయింది. త్వరలో పెళ్లి చేసుకుంటే కీర్తీ సురేష్ నెక్స్ట్ సినిమాలు చేస్తారో లేదో తెలియదు. ఇక వీళ్ల నుంచి సినిమాలు ఉంటాయా? ఉండవా? అనే అనుమానాలేం అక్కర్లేదని అంటున్నారు తమిళ తంబిలు.