- Telugu News Photo Gallery Cinema photos Keerthy Suresh will Entry in Bollywood Industry with Varun Dhawan Movie telugu cinema news
Keerthy Suresh : బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన కీర్తి సురేష్.. ఆ స్టార్ హీరోతో జోడి కట్టనున్న మహానటి..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. అటు తమిళంలోనూ రాణిస్తోంది. మహానటి సినిమాతో అలనాటి హీరోయిన్ సావిత్రిని మరిపించిన కీర్తి.. ఇటీవలే దసరా సినిమాతో మాస్ హీరోయిన్గా అదరగొట్టింది. ఇందులో వెన్నెల పాత్రలో మెప్పించింది కీర్తి.
Updated on: Jul 19, 2023 | 6:29 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. అటు తమిళంలోనూ రాణిస్తోంది.

మహానటి సినిమాతో అలనాటి హీరోయిన్ సావిత్రిని మరిపించిన కీర్తి.. ఇటీవలే దసరా సినిమాతో మాస్ హీరోయిన్గా అదరగొట్టింది. ఇందులో వెన్నెల పాత్రలో మెప్పించింది కీర్తి.

అయితే ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా ఉన్న కీర్తి.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం.

వరుణ్ ధావన్ హీరోగా డైరెక్టర్ అట్లీ ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా కీర్తి సురేష్ ను సంప్రదించినట్లుగా తెలుస్తోంది.

ఒకవేళ ఈ రూమర్స్ నిజమైతే.. బాలీవుడ్ ఇండస్ట్రీలో కీర్తి సురేష్ తొలి సినిమా ఇదే అవుతుంది. గతంలో అజయ్ దేవగన్ నటించిన మైదాన్ చిత్రానికి కీర్తిని ఎంపిక చేసుకున్నారు.

అయితే కొన్ని కారణాలతో కీర్తి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. కీర్తి పాత్రలో ప్రియమణి నటించారు. ప్రస్తుతం కీర్తి భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది.

బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన కీర్తి సురేష్.. ఆ స్టార్ హీరోతో జోడి కట్టనున్న మహానటి..





























