
అందాల ముద్దుగుమ్మ కావ్య కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ బ్యూటీ, బలంగం సినిమాతో ఓ వర్ నైట్ స్టార్ అయిపోయింది.

బలంగం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ చిన్నది తర్వాత వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించిన స్థాయిలో ఈ అమ్మడుకు అవకాశాలు రావడం లేదు అనే చెప్పాలి.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారును మాయ చేస్తుంటుంది. మోడ్రన్ డ్రెస్ ల్లో, స్కిన్ టైట్ డ్రెస్ ధరిస్తూ.. గ్లామర్ గేట్లను ఎత్తేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

కానీ ఇప్పుడు ఈ బ్యూటీ చీరకట్టులో అందంగా కనిపించింది. ఉల్లిపొరలాంటి చీరలో తన అందాలతో కుర్రకారుకు మత్తెక్కిస్తుంది. చేతిలో పుస్తకం పట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చింది. మరో ఫొటోలో తన పెట్ డాగ్ ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ ఉన్న ఫొటోలు షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్స్, చీరలో అందంగా కాదు అచ్చం అప్సరసలానే ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.