
దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు సినీ ప్రముఖులు ఈ పండగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఆ ఫొటోలను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసుకుంది. అలా కాంతారా హీరోయిన్ కూడా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపింది.

ఈ సందర్భంగా రెడ్ కలర్ శారీలో ఎంతో ట్రెడిషినల్‌గా ముస్తాబైంది సప్తమి గౌడ. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో కూడా పాల్గొంది. అనంతరం దసరా సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

ప్రస్తుతం సప్తమి గౌడ ఫొటోలు తెగ వైరలవుతున్నాయి. అభిమానులు వీటిని చూసి క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. కాంతారా సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా పాపులారిటీ సొంతం చేసుకుందీ అందాల తార.

ఇటీవలే వివేక్ అగ్ని హోత్రి తెరకెక్కించిన ది వ్యాక్సిన్ వార్‌లోనూ సైంటిస్టుగా ఒక కీ రోల్‌లో కనిపించిందీ కన్నడ బ్యూటీ. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే సప్తమి గౌడ చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

యువ అనే కన్నడ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది సప్తమి గౌడ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకొంటోంది. అలాగే అభిషేక్ అంబరీష్‌తో కలిసి ఓ మూవీలోనూ నటిస్తోంది.