5 / 5
టాక్సిక్ తర్వాత ఏ సినిమాకి కమిటవ్వలేదు యశ్. అయితే దంగల్ ఫేమ్ నితీష్ తివారి ప్లాన్ చేస్తున్న రామాయణంలో సీతారాములుగా రణ్‌బీర్, సాయి పల్లవి పేర్లు వినిపిస్తున్నాయి. రావణుడిగా యశ్‌ను అడుగుతున్నారు. ఈ పాత్ర కోసం ఏకంగా 150 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే విజయ్, ప్రభాస్ తర్వాత ఆ ఫీట్ అందుకున్న మూడో హీరోగా నిలుస్తారు రాకింగ్ స్టార్.