
ఆషీకీ సిరీస్‌లో మూడో సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. తొలి రెండు భాగాలు సూపర్ హిట్ కావటంతో త్రీక్వెల్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. కార్తిక్ ఆర్యన్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాతో ఆకాంక్ష శర్మ బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. కన్నడ సినిమాలతో పాపులర్ అయిన ఆకాంక్ష గతంలో టైగర్ ష్రాఫ్‌తో కలిసి మ్యూజిక్ వీడియోలో నటించారు.

బాలీవుడ్ నయా సెన్సేషన్ కార్తీక్ ఆర్యన్ హీరోగా మరో బిగ్ మూవీ ఎనౌన్స్ అయ్యింది. బ్లాక్ బస్టర్ రొమాంటిక్ సిరీస్ ఆషికీ ఫ్రాంచైజీలో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ అయిన ఈ సినిమాలో కార్తీక్‌కు జోడిగా నటించబోయేది హీరోయిన్ ఎవరన్న విషయంలో ఇంట్రస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది.

భూల్ భులయ్యా 2 సక్సెస్ తరువాత బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్ రేంజే మారిపోయింది. నిన్న మొన్నటి వరకు మీడియం రేంజ్ స్టార్ అన్నట్టుగా ఉన్న కార్తీక్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ లీగ్‌లోకి ఎంటర్ అయ్యారు. రీసెంట్‌గా సత్యప్రేమ్‌కి కథ కూడా సూపర్ హిట్ కావటంతో కార్తీక్‌తో సినిమా చేసేందుకు బిగ్ ప్రొడక్షన్స్ హౌస్‌లు కూడా పోటి పడుతున్నాయి.

కార్తీక్ హీరోగా టీ సిరీస్‌తో కలిసి ఆషికీ 3 సినిమాను నిర్మిస్తున్నట్టుగా ఎనౌన్స్ చేశారు మహేష్ భట్. సెన్సేషన్ క్రియేట్ చేసిన రొమాంటిక్ సిరీస్‌లో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్ కావటంతో ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో కార్తీక్‌కు జోడిగా నటించే హీరోయిన్ ఎవరన్న చర్చ కూడా గట్టిగానే జరుగుతోంది.

ఆషికీ తొలి భాగంలో రాహుల్ రాయ్, అను అగర్వాల్ జంటగా నటించారు. పెద్దగా స్టార్ కాస్ట్ లేకపోయినా... ఈ సినిమా మ్యూజికల్‌గా బిగ్ హిట్ అయ్యింది. ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా తెరకెక్కిన ఆషికీ 2 సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా మ్యూజికల్‌గానే కాదు కమర్షియల్‌గానూ సంచనాలు నమోదు చేయటంతో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

ఫైనల్‌గా కార్తిక్ ఆర్యన్ హీరోగా సీక్వెల్ ఎనౌన్స్‌మెంట్ రావటంతో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారన్న విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆషిఖీ 2లో నటించిన శ్రద్దా కపూర్ మరోసారి హీరోయిన్‌గా నటిస్తారన్న టాక్ వినిపించింది. అదే సమయంలో బాలీవుడ్ లక్కీ గర్ల్ కృతిసనన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ పేర్లు కూడా తెర మీదకు వచ్చాయి. కానీ ఫైనల్‌గా కన్నడ బ్యూటీ ఆకాంక్ష శర్మను ఫైనల్ చేశారు. కన్నడ సినిమాలతో పాటు బాలీవుడ్‌లో మ్యూజిక్ సింగిల్స్ చేసిన ఈ బ్యూటీ ఆశిఖీ 3తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.