
రీ రిలీజ్.. రెండేళ్లుగా నిర్మాతలకి ఈ పదం బాగా ఎక్కేసింది. డబ్బులొచ్చినా.. రాకపోయినా పాత సినిమాలను కొత్తగా ముస్తాబు చేసి మళ్లీ విడుదల చేస్తూనే ఉన్నారు. మొన్నటి వరకు తెలుగులో ఈ ట్రెండ్ నడిస్తే.. ఇప్పుడిది తమిళంలో మొదలైంది.

కొన్నేళ్లుగా ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ బేస్డ్ సినిమాలు చేస్తూ వచ్చారు. తనలో ఇంకా ఆ వింటేజ్ శంకర్ అలాగే ఉన్నారని నిరూపించుకోవాలంటే.. భారతీయుడు 2 కచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. అదే జరిగితే శంకర్ మేనియా మొదలైనట్లే. 28 ఏళ్ల నాటి పరిస్థితులు వేరు.. ఇప్పుడున్న పరిస్థితులు వేరు.

పైగా ఈ మధ్య శంకర్ అంతగా ఫామ్‌లో లేరు. ఆయన చివరగా తెరకెక్కించిన 2.0, ఐ సినిమాలు అంచనాలు అందుకోలేదు. భారతీయుడు 2 కమల్ హాసన్ కంటే శంకర్‌కు అత్యంత కీలకంగా మారిందిప్పుడు. ఒకప్పుడు సామాజిక అంశాలనే కథలుగా చేసుకుని సినిమాలు చేసిన శంకర్..

మనతో పోలిస్తే.. తమిళంలో రీ రిలీజ్ ట్రెండ్ తక్కువే. బాబా, ప్రేమికుడు లాంటి ఒకట్రెండు మాత్రమే అక్కడ రీ రిలీజ్ అయ్యాయి. అయితే మొన్నామధ్య విజయ్ గిల్లీ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ అయింది.

భారతీయుడు 3కి సంబంధించిన లెంగ్తీ ట్రైలర్ పార్ట్ 2తో పాటు యాడ్ చేశారు. పార్ట్ 3 ట్రైలర్ చూశాక ఆడియన్స్‌కి కూడా కంటెంట్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. సేనాపతి అసలు కథ అంతా త్రీక్వెల్‌లోనే చూపించబోతున్నారు మేకర్స్.