Kalki 2898 AD: కల్కి రికార్డుల మోత.. పాన్ వరల్డ్ లో సత్తా చూపిస్తున్న మూవీ..

|

Jun 30, 2024 | 1:04 PM

మోస్ట్ అవెయిటెడ్ కల్కి 2898 ఏడీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ముందు నుంచి ఊహించినట్టుగానే బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. అదే జోరులో పాత రికార్డుల దుమ్ము దులుపుతోంది ఈ మూవీ. బాహుబలి తరువాత ఆ రేంజ్‌ హిట్ కోసం ఎదురుచూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్‌ ఈ సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

1 / 5
ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీగా ఆడియన్స్‌ ముందుకు వచ్చిన కల్కి 2898 ఏడీ డే వన్ అదే రేంజ్‌లో పెర్ఫామ్ చేసింది. బెనిఫిట్ షోస్ నుంచే సూపర్ పాజిటివ్ టాక్ రావటంతో తొలి రోజు భారీ వసూళ్లు సాధించింది ఈ మూవీ. తొలి రోజు నేషనల్ లెవల్‌లో 95 కోట్ల నెట్ సాధించినట్టుగా అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

2 / 5
తొలి రోజు సాధించిన నెట్ విషయంలో నాలుగో స్థానంలో నిలిచింది కల్కి. డే వన్‌ అత్యధిక నెట్‌ సాధించిన సినిమాల లిస్ట్‌లో 133 కోట్లతో ట్రిపులార్‌ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. 121 కోట్లతో బాహుబలి 2 రెండో స్థానంలో, 116 కోట్లతో కేజీఎఫ్‌ 2 మూడో స్థానంలో ఉన్నాయి. ఇన్నాళ్లు 90 కోట్లతో సలార్‌ నాలుగో స్థానంలో ఉండగా తాజాగా 95 కోట్ల నెట్‌తో కల్కి ఆ ప్లేస్‌ను ఆక్యుపై చేసింది.

3 / 5
కేవలం తెలుగు వర్షనే 64 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, తమిళ్‌లో 4 కోట్లు, హిందీలో 24 కోట్లు, మళయాలంలో 2.2 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. ఓవరాల్‌గా ప్రభాస్‌ కెరీర్‌లో ఇండియాలో రెండో హైయ్యస్ట్ ఓపెనర్‌గా... ఓవర్‌సీస్‌లో ఫస్ట్ హయ్యస్ట్‌ ఓపెనర్‌గా నిలిచింది కల్కి 2898 ఏడీ. 

4 / 5
 ఓవర్‌సీస్‌లో మాత్రం అన్ని సినిమాల రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది కల్కి 2898 ఏడీ. నార్త్ అమెరికాలో కేవలం ప్రీమియర్‌ షోస్‌తోనే 3.8 మిలియన్‌ డాలర్ల వసూళ్లు సాధించి, ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమాగా రికార్డ్ సృష్టించింది.  శుక్రవారం, శనివారం కూడా భారీ వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతోంది కల్కి. ఇప్పటికి $9 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు అందుకుంది. 

5 / 5
రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 298.5 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసింది. ఆ తరువాత ఆదివారం మరోసారి బాక్సాఫీస్ షేక్ అవ్వటం ఖాయం అని భావిస్తున్నారు. ఇవన్నీ చూసుకుంటే ఫస్ట్ వీకెండ్‌కి కల్కి ఆల్‌ టైమ్ రికార్డ్ సెట్ చేయటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. 