
అందుకే పర్సనల్ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకుని.. కల్కికి డేట్స్ ఇచ్చారు ప్రభాస్. కల్కి 2898 AD షూటింగ్ కూడా వేగంగానే జరుగుతుంది. అంతా బాగానే ఉన్నా.. ప్రమోషన్స్ విషయంలో మాత్రం అస్సలు నోరు మెదపడం లేదు దర్శక నిర్మాతలు.

Harom Hara: సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ‘హరోంహర’ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను మే 31న విడుదల చేయనున్నారు. కృష్ణ జయంతి సందర్భంగా అదే రోజు హరోం హర విడుదల చేయబోతున్నారు. 1980’s బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారకా. మాళవిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Gangs Of Godawari: విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం జరిగింది. దీనికి విశ్వక్, నేహా సహా చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. మే 17న విడుదల కానుంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తుంది ఈ చిత్రం.

Baak: తమిళంలో ‘అరణ్మనై’ సిరీస్‌కు మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఈ సిరీస్‌లో నాలుగో భాగాన్ని తీసుకొస్తున్నారు దర్శకుడు కమ్ హీరో సుందర్ సి. అరణ్మనై 4ను తెలుగులో 'బాక్' పేరుతో తీసుకొస్తున్నారు. మే 3న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ చిత్ర సెన్సార్ పూర్తైంది.

Manjummel Boys: మళయాళ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన చిత్రం మంజుమ్మల్ బాయ్స్. ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ఈ సినిమాను చిదంబరం తెరకెక్కించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ఓటిటిలో మే 5న విడుదల కానుంది.