
కాజల్ అగర్వాల్‌పై కష్టాలన్నీ కలిసి ఒకేసారి అటాక్ చేస్తున్నాయి. ఎప్పుడూ బిజీగా ఉన్నట్లే కనిపిస్తుంది కానీ చేతిలో ఒక్క సినిమా కూడా ఉండదు. కమిటైన సినిమాల్లోంచి కూడా ఈమెను తప్పిస్తున్నారు.

రిలీజైన సినిమాల్లో కాజల్ కనిపించట్లేదు. గత మూడేళ్లుగా ఇదే సిచ్యువేషన్‌లో ఉన్నారు ఈ సీనియర్ బ్యూటీ. ఆచార్య నుంచే కాజల్ బ్యాడ్‌లక్ మొదలైంది.

అందులో కథకు కాజల్ క్యారెక్టర్ అక్కర్లేదని.. షూటింగ్ చేసాక తప్పించారు కొరటాల శివ. ఆ తర్వాత నాగార్జున ఘోస్ట్ సినిమాలోనూ హీరోయిన్‌గా తీసుకుని.. తర్వాత తప్పించారు.

ఇక భగవంత్ కేసరిలో ఉన్నా.. కాజల్ పాత్రకు పెద్దగా వెయిటేజ్ ఉండదు. అంతా బాలయ్య, శ్రీలీలే చూసుకున్నారు. ఇండియన్ 2తో అయినా జాతకం మారుతుందేమో అనుకుంటే.. అందులో అసలు కాజల్ కనిపించనే లేదు. పార్ట్ 3లోకి పార్సల్ చేసారు శంకర్.

కానీ పార్ట్ 2 ఫలితం చూసాక ఇండియన్ 3 వచ్చేది అనుమానమే. దాంతో అక్కడ కూడా కాజల్‌కు కష్టాలు తప్పలేదు. ప్రస్తుతం కన్నప్పలో పార్వతిగా నటిస్తున్నారు కాజల్. మొత్తంగా సీనియర్ హీరోలంతా కలిసి కాజల్‌కు షాకిచ్చారు.