
రజినీ సినిమాల్లో భారీ హైప్‌తో వచ్చిన సినిమా ఏదంటే.. ఠక్కున చెప్పే ఆన్సర్ కబాలి. ఈ సినిమా ఫస్ట్ డే చూడకపోతే చచ్చిపోతామేమో అనేంతగా అభిమానులు దానికోసం వేచి చూసారు. రంజిత్ తెరకెక్కించిన కబాలి హైప్ అందుకోవడంలో విఫలమైంది కానీ ఓపెనింగ్స్‌లో రికార్డులు తిరగరాసింది.. కానీ అప్పుడా సినిమాకు కనీసం ట్రైలర్ కూడా విడుదల చేయలేదు మేకర్స్.

కేవలం 2 టీజర్స్ మాత్రమే విడుదల చేసి.. హైప్ పెంచేసారు రంజిత్. ట్రైలర్ లేకుండా సినిమాను విడుదల చేయడం అంటే పెద్ద రిస్కే. కానీ అది కబాలి మేకర్స్ తీసుకున్నారు. తాజాగా ఇదే సెంటిమెంట్ కూలీకి కూడా అప్లై చేయబోతున్నారని తెలుస్తుంది.

రజినీ, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న కూలీ ఆగస్ట్ 14న విడుదల కానుంది. కూలీ నుంచి ఇప్పటి వరకు ఒక్క ప్రాపర్ టీజర్ కూడా రాలేదు. ఓ పాట మాత్రమే విడుదల చేసారు మేకర్స్. ఏం చూపించకపోయినా కూడా సినిమాపై హైప్ మామూలుగా లేదు.

తెలుగులోనూ రికార్డ్ బిజినెస్ చేస్తుంది కూలీ. ఈ సినిమా హక్కులు ఇక్కడ ఏషియన్ సునీల్ తీసుకున్నారు.. తమిళంలో ఆల్ టైమ్ హై బిజినెస్ చేస్తుంది ఈ చిత్రం.ఇందులో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు.

ట్రైలర్ కట్ చేస్తే కథపై ఐడియా వస్తుందని.. ఆ కిక్ ఆడియన్స్‌కు పోకుండా ఉండాలంటే డైరెక్ట్ థియేటర్‌కు వచ్చి వాళ్ల క్యారెక్టర్స్‌ను సెలెబ్రేట్ చేయాలంటున్నారు లోకేష్. ఈయన ఐడియా బాగానే ఉంది కానీ ట్రైలర్ లేకుండా కాస్త రిస్కేనేమో..? పైగా ఆగస్ట్ 14న కూలీకి పోటీగా వార్ 2 కూడా వస్తుంది.