
సీనియర్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్... లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్, సపోర్టింగ్ రోల్స్‌తో సరిపెట్టేసుకుంటారు. కానీ ఓ సౌత్ బ్యూటీ మాత్రం ఈ రూల్‌ను బ్రేక్ చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు చూపించటమే కాదు. బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అవుతున్నారు.

పెళ్లి, ఫ్యామిలీ అంటూ కెరీర్‌లో లాంగ్ బ్రేక్ తీసుకున్న జ్యోతిక, సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కెరీర్‌ను రీస్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ఇంట్రస్టింగ్ మూవీస్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. లీడ్ రోల్‌లో సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకున్నారు.

ఓ వైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే స్టార్ హీరోలతోనూ జోడి కడుతున్నారు జ్యోతిక. రీసెంట్‌గా మలయాళ మూవీ కథల్ ది కోర్ సినిమాలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టికి జోడీగా నటించారు. బోల్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది.

తాజాగా బాలీవుడ్‌లోనూ రీ ఎంట్రీ ఇచ్చారు ఈ బ్యూటీ. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన సైతాన్ సినిమాలో అజయ్ దేవగన్‌కు జోడిగా నటించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావటంతో జ్యోతికకు నార్త్ నుంచి కూడా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.

కేవలం ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా జ్యోతిక జోరు మామూలుగా లేదు. సైతాన్ సినిమా ప్రమోషన్స్ లో కీ రోల్ ప్లే చేశారు ఈ బ్యూటీ. యంగ్ హీరోయిన్స్‌కు ఏ మాత్రం తగ్గని రేంజ్‌లో స్టైలింగ్ విషయంలోనూ అదరగొట్టారు. అందుకే ఇప్పుడు నార్త్ సర్కిల్స్ జ్యోతిక పేరు తెగ ట్రెండ్ అవుతోంది.