
సింపుల్‌గా చెప్పాలంటే ట్రిపుల్ ఆర్ కోసం రాజమౌళి అప్పుడేసిన బాటను ఇప్పుడు దేవరకు వాడుకుంటున్నారు తారక్. బియాండ్ ఫెస్ట్ 2024లో దేవరతో పాటు హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ సేలమ్స్ లాట్, గాడ్జిల్లాలను ప్రదర్శించబోతున్నారు. మొత్తానికి వాటితో సమానంగా స్థానం కల్పించారంటే దేవర రేంజ్ ఏంటో అర్థమవుతుంది.

దేవర సినిమా సెప్టెంబర్ 27న విడుదలవుతుందన్న విషయం తెలిసిందే. కానీ 27న వెరీ ఫస్ట్ షో ఎన్నిటికి పడుతుందో తెలుసా? వేకువజామున. ఒంటిగంటా ఎనిమిది నిమిషాలకు. ఓవర్సీస్‌లో ఈ టైమ్‌కే షోలు పడటానికి ముహూర్తం ఫిక్స్ అయింది. మరి సేమ్ టైమ్‌కి మన దగ్గర కూడా రిలీజ్ అవుతుందా?

జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్‌లో చెర్రీ - జాన్వీ కలిసి నటిస్తే బావుంటుందన్న టాక్ అలా వైరల్ అయిందో లేదో.. వెంటనే నందమూరి అభిమానులు దేవర జోడీని గుర్తుచేసుకుంటున్నారు.

ఆ మధ్య పాట విడుదలైనప్పటి నుంచీ ఏదో రకంగా డిస్కషన్‌లో ఉన్న టాపిక్ ఇది. ఇప్పటిదాకా మీరు చూసింది కొంతే.. అసలు కెమిస్ట్రీ స్క్రీన్ మీద చూడాల్సిందేనని ఊరిస్తున్నారు మేకర్స్.

టాలీవుడ్‌లో అద్భుతమైన కమర్షియల్ పెయిర్‌గా మెప్పించిన ఎన్టీఆర్ - శ్రీదేవి తో ఈ నయాజోడీని పోల్చి మాట్లాడుకుంటున్నారు. తారక్ - జాన్వీ జోడీ ఎలా ఉంది.?