War 2: మరో సర్‌ప్రైజ్ వచ్చిన వార్ 2.. మేకర్స్ ప్లానింగ్ మామూలుగలేదుగా

Edited By: Phani CH

Updated on: Mar 05, 2025 | 9:50 PM

వార్ 2 అంటే అంతా ఏదో యాక్షన్ డ్రామా.. ఇందులో అంతా ఫైట్స్ ఎక్కువగా ఉంటాయని ఫిక్సైపోయారు. అందులో ఆడియన్స్ తప్పేం లేదు.. ముందు నుంచి ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు కూడా. అయితే ఇందులో మర్ సర్‌ప్రైజ్ కూడా ఉంది. ఒకటి రెండూ కాదు.. పెద్ద ప్లానింగే చేస్తున్నారు వార్ 2 మేకర్స్. అవేంటో మీరు కూడా చూసేయండి మరి.

1 / 5
దేవర సినిమాతో ఊహించిన దానికంటే పెద్ద విజయమే అందుకున్నారు తారక్. బాలీవుడ్‌లోనూ ఈ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. ఆల్రెడీ ట్రిపుల్ ఆర్‌తో వచ్చిన క్రేజ్ దేవరకు పనికొచ్చింది.

2 / 5
తాజాగా వార్ 2తో బాలీవుడ్ మార్కెట్ డబుల్ అవుతుందని చూస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్నారు ఎన్టీఆర్. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌పై మేజర్ అప్‌డేట్ వచ్చింది.

3 / 5
వార్ 2 షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే తారక్, హృతిక్ రోషన్‌పై వచ్చే సోలో సీన్స్ అన్నీ పూర్తి చేసారు దర్శకుడు అయన్ ముఖర్జీ. ఈ మధ్యే ఫేస్ ఆఫ్ సీన్స్‌ కూడా అయిపోయాయి. క్లైమాక్స్‌లో తారక్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా అన్నట్లుగా ఉంటాయని తెలుస్తుంది.

4 / 5
వార్ 2లో యాక్షన్ పార్ట్ నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతున్నాయని అర్థమవుతుంది. అంతేకాదు.. వార్ 2లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌పై అదిరిపోయే డాన్స్ నెంబర్ కూడా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ పాట చిత్రీకరణ షురూ అయింది. ముంబైలోని యశ్ రాజ్ స్టూడియోస్‌లో 500 మంది డాన్సర్స్‌తో ఇద్దరు హీరోలపై ఈ పాటను షూట్ చేస్తున్నారు.

5 / 5
వార్ 2లో యాక్షన్ సీక్వెన్స్‌లే కాదు డాన్సులు కూడా హైలైట్ కానున్నాయి. ఇండియన్ సినిమాలో ఇద్దరు బెస్ట్ డాన్సర్స్ తమ సినిమాలో ఉన్నపుడు.. దాన్ని క్యాష్ చేసుకోకుండా మేకర్స్ ఎందుకుంటారు చెప్పండి..? అందుకే వీళ్ళపై డాన్స్ నెంబర్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఆగస్ట్ 14న వార్ 2 విడుదల కానుంది.