
దేవర సినిమా విషయంలో తారక్ ఫ్యాన్స్ నుంచి చాలా కంప్లయింట్స్ వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా యూనిట్ సైడ్ నుంచి రెగ్యులర్‌గా అప్‌డేట్స్ లేకపోవటంతో అభిమానులు ఫీల్ అవుతున్నారు.

అందుకే సెట్ నుంచి లీక్ అయిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. దేవర సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

అయితే ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ ముందు నుంచి చేస్తున్న కంప్లయింట్స్ అప్‌డేట్ లేవని. షూటింగ్ ప్రారంభమైన తరువాత అఫీషియల్‌గా అప్‌డేట్స్ ఇవ్వటమే మానేసింది యూనిట్.

దీంతో చాలా రోజులుగా సాలిడ్ అప్‌డేట్ కోసం వెయిట్ చేస్తోంది తారక్ ఆర్మీ. తారక్ టీమ్ నుంచి అఫీషియల్ అప్‌డేట్ లేకపోయినా.. సెట్ నుంచి లీక్ అయిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

అఫీషియల్ అప్‌డేట్ లేకపోయినా... దేవర ట్రెండింగ్‌లోకి వచ్చిందంటే అభిమానుల్లో హైప్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ట్రెండ్ అవుతున్న ఫోటోలో ఎన్టీఆర్ లుక్స్‌కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

ముఖ్యంగా గతంలో తారక్ ఎప్పుడు చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తుండటం, అది కూడా సీ బ్యాక్ డ్రాప్‌లో వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్ కావటంతో ఎన్టీఆర్ విశ్వరూపాన్ని వెండితెర మీద చూసేందుకు ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.