
అనిరుధ్ కారణంగా దేవర షూటింగ్ ఆలస్యం అవుతుందా..? మామూలుగానే ఔట్ పుట్ ఇవ్వడంతో కాస్త డిలే చేస్తాడని.. చేసినా ఔట్ పుట్ అదిరిపోతుంది కాబట్టి అనిరుధ్‌పై కంప్లైంట్స్ ఉండవనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. మరి ఇదే దేవర విషయంలోనూ జరుగుతుందా..? అదే నిజమైతే దేవర షూటింగ్ అప్‌డేట్స్ ఏంటి..? నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడు..?

కొన్ని రోజులుగా దేవర షూటింగ్‌కు దూరంగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రెస్ట్ మోడ్‌లో ఉన్నారు. జనవరి 18 నుంచి దేవర కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. అల్యూమీనియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు కొరటాల శివ. తారక్‌తో పాటు మెయిన్ కాస్ట్ అంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారు.

వారం రోజుల పాటు అల్యూమీనియం ఫ్యాక్టరీలో దేవర షెడ్యూల్ జరగనుంది. ఎప్రిల్ 5న విడుదల కాబట్టి.. షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు కొరటాల. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో బానే ఉండబోతున్నాయి. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ కోసం టైమ్ ఎక్కువ కావాలి. అయితే అనిరుధ్ కారణంగా సాంగ్స్ షూట్ ఆలస్యమవుతుందని తెలుస్తుంది.

తమిళంలోనూ బిజీగా ఉండటంతో దేవరకు అనిరుధ్ ఇంకా పాటలు ఇవ్వలేదని తెలుస్తుంది. ఆలస్యమవుతున్నా.. టీం మాత్రం ప్రశాంతంగానే ఉన్నారు. టైమ్ తీసుకున్నా.. అనిరుధ్ ఔట్‌పుట్ ఎలా ఉంటుందో క్లారిటీ ఉంది.

అందుకే ముందు టాకీ పూర్తి చేసి.. ఆ తర్వాత సాంగ్స్ షూట్ చేయాలని చూస్తున్నారు. ఎలా చూసుకున్నా.. ఎప్రిల్ 5న దేవర పార్ట్ 1 రావడం మాత్రం ఖాయం అంటున్నారు మేకర్స్.