ప్రభాస్ ఫెయిలయ్యాడు.. మరి ఎన్టీఆర్ ఏం చేస్తాడో..

Edited By: Phani CH

Updated on: Mar 02, 2025 | 2:33 PM

ఇదివరకు మన హీరోలకు ఇండియా మెయిన్ మార్కెట్ అయితే.. ఓవర్సీస్ బోనస్ కింద ఉండేది. కానీ ఇప్పుడలా కాదు.. ఓవర్సీస్ కూడా సినిమా ఫలితాన్ని డిసైడ్ చేస్తుంది. మరీ ముఖ్యంగా జపాన్ మనకు సెకండ్ హోమ్‌లా మారిపోతుంది. తాజాగా దేవరతో జపాన్ జర్నీకి సిద్ధమయ్యారు తారక్. మరి మన ఫలితమే అక్కడ కూడా రిపీట్ అవుతుందా..? దేవరను జపనీస్ చూస్తారా..?

1 / 5
జపాన్‌లో మెల్లమెల్లగా ఇండియన్ సినిమాలకు మార్కెట్ పెరుగుతుంది. మరీ ముఖ్యంగా తెలుగు హీరోలకు కూడా అక్కడ గుర్తింపు వస్తుంది. ఇప్పటికే ప్రభాస్ జపనీయులకు బాగా చేరువయ్యారు. బాహుబలి, సలార్ లాంటి సినిమాలు అక్కడ మంచి వసూళ్లు సాధించాయి.. కానీ కల్కితో మాత్రం నిరాశ పరిచారు ప్రభాస్.

2 / 5
ప్రభాస్ మాత్రమే కాదు.. తెలుగులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు కూడా జపాన్‌లో మంచి మార్కెట్ ఉంది. ట్రిపుల్ ఆర్‌తో జపాన్‌లో తిరుగులేని ఫ్యాన్ బేస్ ఏర్పడింది ఈ ఇద్దరు హీరోలకు.

3 / 5
అక్కడ ఏడాది పాటు ఆడింది ట్రిపుల్ ఆర్. 30 ఏళ్ళుగా ముత్తు పేరు మీదున్న రికార్డులను సైతం ట్రిపుల్ ఆర్ కొల్లగొట్టింది. ఇది జూనియర్ ఎన్టీఆర్‌కు బాగా హెల్ప్ అయింది. ట్రిపుల్ ఆర్‌తో వచ్చిన క్రేజ్ వాడుకుంటూ.. దేవరను కూడా జపాన్‌లో విడుదల చేస్తున్నారిప్పుడు.

4 / 5
మార్చి 28న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్ కోసం జపాన్ వెళ్తున్నారు ఎన్టీఆర్. ఇప్పటికే అక్కడి మీడియాతో జూమ్‌లో మాట్లాడారు తారక్. ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

5 / 5
ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2తో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ చిత్ర షూట్ సైతం మొదలైంది. త్వరలోనే ఇందులో జాయిన్ కానున్నారు తారక్. ఇక మార్చి 22న జపాన్ వెళ్తున్నారు ఎన్టీఆర్. ఈలోపు జూమ్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు. మరి మన దగ్గర ఇరగదీసిన దేవర.. జపాన్‌లోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అనేది చూడాలిక.