Rajitha Chanti |
Jun 15, 2021 | 9:51 PM
జాతిరత్నాలు సినిమా తర్వాత చాలామంది దర్శకనిర్మాతలు తమ నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ఫరియాను తీసుకోవాలని భావించారు. అయితే ఈ చిట్టి మాత్రం ఇంతవరకు ఏ సినిమా అప్ డేట్ రాలేదు.
తాజాగా ఈ బ్యూటీ తదుపరి సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది.
లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఫరియాకు మంచు ఫ్యామిలీ నుంచి ఓ బెస్ట్ ఆఫర్ వచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. మంచు విష్ణు హీరోగా వస్తున్న మూవీ కోసం ఆమెను సంప్రదించినట్లు సమాచారం.
మంచు విష్ణు హీరోగా వచ్చిన ఢీ మూవీ.. అప్పట్లో సెన్షేషన్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. శ్రీనువైట్ల డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి సీక్వెల్ కోసం ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తికాగా.. హీరోయిన్ కోసం ఫరియాను సంప్రదించారట.
అంతేకాకుండా.. హీరో విష్ణు ఈ బ్యూటీని ఒప్పించేందుకు డైరెక్ట్ గా రంగంలోకి దిగాడట. అయితే ఫరియా కూడా ఈ సినిమాకు పాజిటివ్ గానే స్పందించినట్లు తెలుస్తోంది.
ఫరియా అబ్ధుల్లా..